పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టిన ప్రేమజంట.. !

ఆవేశమో, అనాలోచిత నిర్ణయమో కానీ ప్రేమిస్తే మాత్రం మరణం తప్పదనేలా ఉంది నేటికాలంలో.ప్రేమించడానికి చూపించే తెగువ పెద్దలను ఒప్పించి ఒక్కటవ్వడానికి చూపించడం లేదు.

 Adilabad Lovers Suicide Attempt-TeluguStop.com

కొన్ని సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మాయి ప్రేమ పేరుతో ఒకడ్ని తీసుకువచ్చి వీడే నా మొగుడు అంటే ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణానితం.వారు ఒప్పుకోవడానికి కాస్త సమయం పడుతుంది.

అలాగని ఆగలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి గుండెకోతను మిగుల్చుతున్నారు నేటికాలపు యువతి యువకులు.ఆ సమయంలో కన్న తల్లి ప్రేమ వారికి గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం.

 Adilabad Lovers Suicide Attempt-పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టిన ప్రేమజంట.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఓ జంట తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది.

ఆ వివరాలు చూస్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దహెగాం గ్రామానికి చెందిన యువ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వీరిలో యువకుడు గోడెం శ్రీరామ్‌ మృతిచెందగా.అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆ యువతిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందింది.

ఇక ఒకే కులానికి చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

#Dahegam #Death #Lovers Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు