అదిరే అభి వైట్ పేపర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన మెగా బ్రదర్ నాగబాబు

జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ” వైట్ పేపర్” (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Adihire Abhi Movie White Paper First Look Released By Nagababu Details, Adihire-TeluguStop.com

జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు.ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు.

ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు.

ఈ వైట్ పేపర్ చిత్రం మొదటి పోస్టర్ ని మెగా బ్రదర్ నాగబాబు గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, జబర్దస్త్ లో తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులని మీపించాడు.

ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా తో హీరో గా పరిచయం అవుతున్నాడు.ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉంది.సినిమా ని కూడా కేవలం 9 గంటల 51 నిమిషాలు పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు.అభి అండ్ వాళ్ళ టీం పడిన కష్టానికి ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను, టీం అందరికి నా శుభాకాంక్షలు” అని అన్నారు.

Telugu Abinaya Krishna, Adihire Abhi, Jabardasth Abhi, Nagababu, Tollywood, Whit

హీరో అభి మాట్లాడుతూ ” మొన్న విడుదల చేసిన టైటిల్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు మా సినిమా ఫస్ట్ లుక్ ని నా ఫేవరెట్ నటులు మెగా బ్రదర్ నాగబాబు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

డైరెక్టర్ శివ మాట్లాడుతూ “సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు.నాగబాబు గారి బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉండాలి, పోస్టర్ చూస్తుంటే మేము పడిన కష్టం మరిచిపోతున్నాం, ఇలా పెద్దలందరు మా సినిమా ని , మేము చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజశేఖర్, శ్యామ్ ప్రసాద్, రవి వంశీ లు పాల్గొన్నారు.

అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా కి నిర్మాత – గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ, ఎడిటింగ్- కె.సి.బి.హరి సంగీతం – నవనిత్ చారి, పి.ఆర్.ఓ- పవన్ పాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube