బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Rauth) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) కృతి సనన్(Kriti Sanon) జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్(Adi Purush) .ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా జూన్ 6వ తేదీ తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ సినిమా ప్రేమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైనటువంటి పాటలు టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.ఇకపోతే తాజాగా నటి కృతి సనన్ ఐఫా వేడుకలలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి కృతి సనన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆది పురుష్ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని తెలియజేశారు.ఇలాంటి ఒక గొప్ప సినిమాలు తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని కృతి సనన్ పేర్కొన్నారు.ఇక ఈ సినిమాని అన్ని తరాల వారు చూడదగిన సినిమా అని ముఖ్యంగా ఈ సినిమాని పిల్లలు తప్పకుండా చూడాలని ఈమె తెలియజేశారు.ఇప్పటివరకు మనం మహాభారతంలోని కథలను మన పెద్దవాళ్ళు చెబితే విన్నాము వాటిని సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే పిల్లలు కూడా సినిమాలు చూడటం వల్ల వారికి కూడా

మహాభారతం రామాయణం అంటే ఏంటో తెలుస్తుందని అందుకే ఈ సినిమాను ముఖ్యంగా పిల్లలు(Kids) చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఈమె తెలియజేశారు.ఇక ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన జైశ్రీరామ్ పాట(Jai Sri Ram Song) సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక రెండవ సాంగ్ కోసం తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని కృతి సనన్ తెలియజేశారు
.