'రేణు దేశాయ్'ని ముద్దు పెట్టుకుంటున్న ఈ పిల్ల ఎవరో తెలుసా?

రేణు దేశాయ్.ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు.

 Renu Desai, Adhya, Pawan Kalyan, Kissing Photo Viral, Web Series, Tv Shows, Nand-TeluguStop.com

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆతర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోవడం.

పవన్ కళ్యాణ్ రష్యన్ మహిళను పెళ్లి చేసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి.ఇక అప్పటి నుంచి తన జీవితాన్ని తానే చూసుకుంటున్న రేణు దేశాయ్ కొన్ని సినిమాలు డైరెక్ట్ చెయ్యగా ఇప్పుడు బుల్లితెరపై, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది.

ఎన్నో ఏళ్ళ తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది రేణు దేశాయ్.కూతురు ఆద్య పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని నందిని రాయ్, ధన్సిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ఇండియా మొత్తం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ సెట్ లో షూటింగ్ ఎలా జరుగుతుంది? మేకప్ ఎలా వేస్తారు అనే విషయాలు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఇన్నాళ్లు షూటింగ్ బిజీలో ఉన్న రేణు దేశాయ్ ఇప్పుడు ఫ్రీ అయ్యింది.అందుకే షూటింగ్ విశేషాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూనే ఉన్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉందనేది చెప్తూనే కూతురు ఆద్యతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.

ప్రకృతిని ఆస్వాదిస్తోన్నట్టుగా ఉన్న ఆ ఫోటోలను షేర్ చేసిన ఆమె తాజాగా ఆద్యా రేణు దేశాయ్ కి ముద్దు పెడుతున్న ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube