చమ్మక్ చంద్ర నిజస్వరూపం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్..?

కమెడియన్లలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.కొందరు మాటలతో నవ్వు తెప్పిస్తే మరి కొందరు హావభావాలతో నవ్వు తెప్పిస్తారు.

 Adhurs Anand Sensational Comments About Chammak Chandra, Lady Getups, Jabardasth-TeluguStop.com

కొందరు కమెడియన్లు మాత్రం మాటలతో, హావభావాలతో నవ్వు తెప్పించగలరు.అలాంటి కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరు.

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చమ్మక్ చంద్ర స్కిట్లను అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు.

ప్రస్తుతం చమ్మక్ చంద్ర జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షోలో స్కిట్లు చేస్తున్నారు.

చంద్ర స్కిట్లకు యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తాయి.ఒకవైపు స్కిట్ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటూనే సినిమాల్లో అడపాదడపా పాత్రల్లో నటిస్తూ చంద్ర తన స్థాయిని పెంచుకుంటున్నారు.

ఎక్కువగా లేడీ గెటప్ లలో కనిపించి కామెడీని పండించడం చంద్ర స్టైల్.జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా అందరికంటే ఎక్కువగా చంద్రనే పారితోషికం తీసుకున్నాడు.

అదిరింది షోలో కూడా చమ్మక్ చంద్రనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనే టాక్ ఉంది.తన స్కిట్లలో అవకాశమిచ్చి చంద్ర ఎంతో మంది కమెడియన్లను బుల్లితెరకు పరిచయం చేశారు.

అలా చంద్ర పరిచయం చేసిన కమెడియన్లలో అదుర్స్ ఆనంద్ ఒకరు.ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చమ్మక్ చంద్ర గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పారు.
చంద్రన్న జబర్దస్త్ షోను విడిచిపెట్టి వెళ్లిన తరువాత తనకు టీమ్ లీడర్ గా ఛాన్స్ వచ్చిందని ఆ విషయం చంద్రన్నకు చెబితే సొంత అన్న ఏ విధంగా ప్రోత్సహిస్తారో అదే విధంగా ప్రోత్సహించాడని అన్నారు.మంచి స్కిట్లు రాసి ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రోత్సహించాడని బెస్ట్ టీమ్ లీడర్ గా ఎదగాలని సూచించాడని అన్నారు.

అలా మాట్లాడుతున్న సమయంలో చంద్రన్న కళ్లలో నీళ్లు వచ్చాయని.టాలెంట్ ను ప్రోత్సహించడంలో చంద్రన్న ఎప్పుడూ ముందుంటారని ఆనంద్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube