అదిరింది : ఇలా అయితే జబర్దస్త్‌ను ఢీ కొట్టడం కష్టమే

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కార్యక్రమం నుండి నాగబాబు తప్పుకున్న విషయం తెల్సిందే.ఆయన తప్పుకున్న నేపథ్యంలో జబర్దస్త్‌ కు ప్రేక్షకుల ఆధరణ తగ్గడం కన్ఫర్మ్‌ అనుకున్నారు.

 Adhirindhi Promo Release-TeluguStop.com

కాని ఇటీవల నాగబాబు లేకుండానే ప్రసారం అయిన జబర్దస్త్‌కు మంచి ఆధరణ లభించింది.కనుక నాగబాబు తప్పు చేశాడా అంటూ కొందరు ఎద్దేవ చేశారు.

ఇలాంటి సమయంలో నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

Telugu Adhirindhi, Etvjabardasth, Zeeadhirindhi-

నాగబాబు అదిరింది మొదటి ఎపిసోడ్‌ ఈ ఆదివారం ప్రసారం కాబోతుంది.ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది.ప్రోమోను చూస్తుంటే అచ్చు జబర్దస్త్‌ను పోలి ఉంది.

అచ్చు జబర్దస్త్‌ సెట్‌ను పోలి ఉండటంతో పాటు స్కిట్‌లు కూడా అలాగే ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.జీ తెలుగులో ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Telugu Adhirindhi, Etvjabardasth, Zeeadhirindhi-

అదిరింది అచ్చు జబర్దస్త్‌లా ఉండటం వల్ల దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.జబర్దస్త్‌కు విభిన్నంగా ఉండాలని జనాలు అంటున్నారు.అప్పుడే జబర్దస్త్‌ను ఢీ కొట్టగల సత్తా ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన కమెడియన్స్‌ను ఇందులోకి తీసుకు వచ్చిన నాగబాబు యాంకర్‌ విషయంలో మాత్రం నిరాశ పర్చాడు.

అనసూయ లేదా రష్మికల్లో ఎవరినో ఒకరిని తీసుకు వస్తే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube