టాలీవుడ్ లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జబర్దస్త్ షో లో హైపర్ ఆది పంచుల గురించి తెలియని వారుండరు.కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం తన పంచులతో మాత్రమే స్కిట్ ని లేపడం హైపర్ ఆది స్పెషాలిటీ.
అయితే తాజాగా హైపర్ ఆది గురించి జబర్దస్త్ షోలో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి అదిరే అభి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అప్పట్లో హైపర్ ఆది తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు తనకు ఆసక్తి ఉందని కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వాలని తనకు మెసేజ్ చేసినట్లు అదిరే అభి చెప్పుకొచ్చాడు.
దీంతో ఒకసారి హైపర్ ఆదిని పిలిచి మాట్లాడానని ఇక అప్పటి నుంచి తమ మధ్య పరిచయం ఏర్పడి తన స్కిట్ లలో నటించే అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చాడు తెలిపాడు.కానీ హైపర్ ఆది చాలా టాలెంట్ కలిగిన వ్యక్తి అని అతి కొద్ది కాలంలోనే తన స్కిట్లలో కమేడియన్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగాడని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది హైపర్ ఆది అదిరే అభిని చిన్న చూపు చూస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారని, అది అవాస్తవమని తెలిపాడు.అలాగే హైపర్ ఆది నటనలో ఇంకా మెరుగులు దిద్దుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకునే వ్యక్తులలో తాను మొదటి వాడినని చెప్పుకొచ్చాడు.
అలాగే తమ మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా మాట్లాడుతూ హైపర్ ఆది మొదట్లో అవకాశం కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గౌరవంగా, వినయంగా ఉన్నాడో ఇప్పటికీ తనతో అలాగే ఉన్నాడని ఏ రోజు తన వద్ద అసభ్యకరంగా, అగౌరవంగా ప్రవర్తించలేదని తెలిపాడు.అయితే ఒక్కోసారి కామెడీ పండించడం కోసం స్కిట్లలో తాము ఒకరిపై ఒకరు పంచులు పేలుస్తామని అంతే తప్ప తమ మధ్య మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అదిరే అభి “పాయింట్ బ్లాంక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో అదిరే అభి యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఉండబోతున్నట్లు గతంలో పలుమార్లు అదిరే అభి చెప్పుకొచ్చాడు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ ఇప్పటికే పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.