ఈ ఒక్క విషయంలో మాత్రం ఆధార్‌ ఉపయోగం అద్బుతం.. మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు

ఆధార్‌ కార్డు అనేది అద్బుతం అని, దాని వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అంటూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తున్నాయి.అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది.

 Adhar Helps Missing Boy Find His Parents-TeluguStop.com

కాని ఇప్పుడు కొందరు ఆధార్‌ వల్ల వ్యక్తిగత భద్రత ఉండటం లేదని, ప్రతి విషయాన్ని కూడా జనాలు తెలుసుకునే అవకాశం ఉందని, చివరకు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనే విషయాలను కూడా ఆధార్‌ ద్వారా తెలుసుకునే పరిస్థితి వచ్చిందని, అందుకే దాన్ని క్యాన్సిల్‌ చేయాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆధార్‌ కార్డు ప్రతి చోట ఇవ్వడం వల్ల వ్యక్తిగత భద్రత ఉండటం లేదని చాలా మంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక విషయంలో మాత్రం ఆధార్‌ చాలా ఉపయోగపడుతోంది.

కొన్ని రోజుల క్రితం మనం ఒక పోస్ట్‌ పెట్టడం జరిగింది.అందులో ఎవరైనా పిల్లలు తప్పిపోతే వెంటనే వారిని ఆధార్‌ కేంద్రంకు తీసుకు వెళ్లాలని, తద్వారా ఆ పిల్లాడి అడ్రస్‌ తెలుస్తుందని గతంలో చెప్పిన విషయం మీకు తెల్సిందే.

ఇప్పుడు అచ్చు అలాంటిదే జరిగింది.అయితే కాస్త ఆలస్యంగా ఆ పిల్లాడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు.

ఈ ఒక్క విషయంలో మాత్రం ఆధార్‌ ఉ

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 2018 సెప్టెంబర్‌ 18వ తారీకున జార్ఖండ్‌కు చెందిన ఉమన్‌ అనే బాలుడు ఉత్తరప్రదేశ్‌ రైల్వే స్టేషన్‌లో తప్పి పోయాడు.కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఫలితం లేకుండా పోయింది.అయితే పోలీసులకు దొరికిన ఆ బాలుడిని సంరక్షణ కేంద్రంలో ఉంచడం జరిగింది.బాలుర సంరక్షణ కేంద్రం వారు పిల్లాడిని ఇటీవల స్కూల్‌కు పంపించాలని భావించారు.అందుకోసం ఆధార్‌ కార్డ్‌ అవసరం అయ్యింది.

ఆధార్‌ కేంద్రంకు పిల్లాడిని ఆధార్‌ కార్డ్‌ కోసం అని పంపించిన సమయంలో అక్కడ బాలుడికి ఇప్పటికే ఆధార్‌ ఉందని తేలింది.

అయితే బాలుడి పింగర్‌ ఫ్రింట్స్‌ ఆధారంగా పిల్లాడి అడ్రస్‌, తండ్రి ఫోన్‌ నెంబర్‌ను కనిపెట్టారు.దాంతో పిల్లాడి తండ్రికి ఫోన్‌ చేసి అతడిని అప్పగించారు.ఆధార్‌ వల్ల ఇదొక్కటి మంచి పని జరుగుతుందని అంతా అంటున్నారు.ఆధార్‌ వల్ల ఇంకా కూడా చాలా మంచి జరుగుతుంది, అవినీతి తగ్గిందని ప్రభుత్వాలు అంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube