ఆ సినిమా లో లింగ మార్పిడి చేయించుకుంటున్న ఆదా శర్మ

తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముంబై ముద్దుగుమ్మ ఆధాశర్మ చేసినవి కొన్ని సినిమాలే అయిన సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తూ అందరి చూపు తనపై పడేలా చేసుకుంటుంది.తెలుగు సినిమాలు పెద్దగా చేయకపోయినా అప్పుడప్పుడు బాలీవుడ్ లో మాత్రం ఈ భామ మంచిగానే అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

 Adha Sharma Will Become Trans Gender In Bollywood Movie-TeluguStop.com

తన గ్లామర్ విన్యాసాలతో బాలీవుడ్ దర్శకులని ఆకర్షిస్తున్న ఆదాశర్మకి దర్శకులు మంచిగానే అవకాశాలు ఇస్తున్నారు.ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ భామ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీకి సిద్ధం అవుతుంది.

ప్రయోగాత్మక కథలతో సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ కొంత ముందు వరుసలో ఉంటుంది.ఈమధ్యే లెస్బియన్ లవ్ ప్రధానాంశంగా ‘ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లాగా అనే సినిమాలో సోనమ్ కపూర్ నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదా శర్మ హీరోయిన్ గా లింగమార్పిడి కాన్సెప్ట్ తో మ్యాన్ టు మ్యాన్ అనే టైటిల్ తో తెరకెక్కే ఒక సంచలనాత్మక చిత్రంలో నటిస్తోంది.పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుంది.

కానీ ఈ విషయం తెలియని హీరో ఆదాను పెళ్ళి చేసుకుంటాడు.వివాహం తర్వాత ఈ లింగమార్పిడి కథ తెలుసుకున్న భర్త అవాక్కవుతాడు.

ఇలాంటి డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాని అక్కడి జనాలు ఎంత వరకు ఆదరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube