అప్పుడే మొదలైన చేరికలు.. రేవంత్ ను కలుస్తున్న కీలక నేతలు..

తెలంగాణ రాష్ర్ట టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీడు పెంచారు.

ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలను బుజ్జగించడం కూడా పూర్తి చేసుకున్నారు.

ప్రస్తుతం పార్టీ పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.ఇప్పటికే పార్టీలోని సీనియర్లందరినీ ఆయన కలుసుకున్నారు.

ఇయాళ మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత ఎర్ర శేఖర్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్, జయ శంకర్ భూపాల పల్లి జిల్లా సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు.

వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.ఓ వైపు కాంగ్రెస్ లోని కొందరు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేఖిస్తున్నా.

Advertisement

కూడా అదేమీ పట్టించుకోకుండా మరో వైపు రేవంత్ రెడ్డి ఇలా పార్టీలో చేరికల కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాడు.కాంగ్రెస్ పార్టీలో మేజర్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వం పై కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాళ్లు ఇప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ పెద్దలకు ఎంత విన్నవించినా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నే ప్రకటించారని వారంతా కొంత అసహనంతో ఉన్నారు.

అయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాత్రం తన మార్కు చూపుతున్నారు.ఎవరెన్ని విధాలుగా తనను ఆపాలని ప్రయత్నించినా.ఆగేదే లేదని చాటి చెబుతున్నారు.

కాంగ్రెస్ లో టీఆర్ఎస్ పార్టీకి కోవర్టులు ఉన్నారని ఆయన బాంబ్ పేల్చారు.అలాంటి వారంతా పార్టీ వదలి వెళ్లిపోవాలని లేకుంటే అందరికీ తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అన్నారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిసిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు