అప్పుడే మొదలైన చేరికలు.. రేవంత్ ను కలుస్తున్న కీలక నేతలు..

తెలంగాణ రాష్ర్ట టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీడు పెంచారు.ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలను బుజ్జగించడం కూడా పూర్తి చేసుకున్నారు.

 Additions That Just Started Key Leaders Meeting Rewanth To Join Congress, Congre-TeluguStop.com

ప్రస్తుతం పార్టీ పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.ఇప్పటికే పార్టీలోని సీనియర్లందరినీ ఆయన కలుసుకున్నారు.

ఇయాళ మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత ఎర్ర శేఖర్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్, జయ శంకర్ భూపాల పల్లి జిల్లా సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు.

వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.ఓ వైపు కాంగ్రెస్ లోని కొందరు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేఖిస్తున్నా… కూడా అదేమీ పట్టించుకోకుండా మరో వైపు రేవంత్ రెడ్డి ఇలా పార్టీలో చేరికల కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీలో మేజర్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వం పై కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.వాళ్లు ఇప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ పెద్దలకు ఎంత విన్నవించినా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నే ప్రకటించారని వారంతా కొంత అసహనంతో ఉన్నారు.

Telugu Bjperra, Congress, Revant Reddy-Telugu Political News

అయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాత్రం తన మార్కు చూపుతున్నారు.ఎవరెన్ని విధాలుగా తనను ఆపాలని ప్రయత్నించినా… ఆగేదే లేదని చాటి చెబుతున్నారు.కాంగ్రెస్ లో టీఆర్ఎస్ పార్టీకి కోవర్టులు ఉన్నారని ఆయన బాంబ్ పేల్చారు.అలాంటి వారంతా పార్టీ వదలి వెళ్లిపోవాలని లేకుంటే అందరికీ తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అన్నారు.

ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిసిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube