మీకు సెల్ఫీ తీసుకోవడం అంటే ఇష్టమా..అయితే మీరు మానసిక వ్యాధితో బాధపడ్తున్నారు..కావాలంటే చదవండి..

మీకు సెల్ఫీ తీసుకునే అలవాటుందా.అలవాటు అంటే తెలుసు కదా చేసే ప్రతి పనిని,వెళ్లిన ప్రతి చోటులో సెల్ఫీ దిగడం.

 Addiction To Selfies Is A Mental Disorder-TeluguStop.com

అయితే మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు.అయ్యో ఇది మేం చెప్తున్న మాట కాదండీ.

సెల్ఫీలు తీసుకోవడం ఒక రకమైన మానసిక వ్యాధని శాస్త్రవేత్తలే చెప్తున్నారు.అమెరికన్ సెక్రియాట్రిక్ అసోసియేషన్ 2014లోనే సెల్ఫీ తీసుకోవడం మానసిక రోగం అని ప్రకటించింది.

సెల్ఫీ నిజంగానే మానసిక రుగ్మత అనే విషయంపై మరోసారి లండన్‌కు చెందిన నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ.తమిళనాడుకు చెందిన త్యాగరాజన్ స్కూల్ ఆఫ్ మేనూజ్ మెంట్‌లు సంయుక్తంగా అధ్యాయనం చేశారు.భారతదేశంలోని వివిధ విశ్వవిధ్యాలయాలకు చెందిన కొంతమంది విద్యార్థులపై సర్వే చేశారు.అందులో 400 మందికి సెల్ఫీటిస్ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు.ఈ పరిశోధనకు భారతీయులను ఎంచుకోవడానికి కారణం ఉంది.భారతీయులే ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.సెల్ఫీ మరణాలు కూడా ఎక్కువగా ఉండటంతో పరిశోధనలు భారత్’లో చేశారు.2016లో సెల్ఫీ మరణాలు 127 సంభవించాయి.అందులో మన దేశంలోనే 76 ఉన్నాయి.

ఈ అధ్యాయనంలో పరిశోధకులు సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిన రుగ్మతే అని కనుగొన్నారు.

అంతేకాకుండా మానసిక వ్యాధి స్థాయిని అంచనా వేయడానికి‘సెల్ఫీటిస్ బిహేవియర్ స్కేల్’ని కూడా తయారు చేశారు.ఈ సెల్ఫీటిస్‌లో బార్డర్ లైన్, అక్యూట్,క్రోనిక్ అని మూడు రకాలుగా విభజన చేశారు.

ఒక రోజులో ఆరు కంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారికి క్రోనిక్ సెల్ఫీటిస్ కిందకి వస్తుందని తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube