ఔను.. మేము కూడా వాయిదా వేస్తున్నాం అంటూ మహేష్ టీం క్లారిటీ

మహేష్‌ బాబు నిర్మాణ సంస్థ ప్రారంభించి చాలా కాలం అయ్యింది.కాని ఇప్పటి వరకు ఆయన నిర్మాణం లో బయట హీరో లతో సినిమా లు రాలేదు.

 Adavi Sheshu Movie Major Release Again Postpone Details, Hero Adavi Sesh, Major Movie, Mahesh Babu, Sony Pictures, Post Poned, Corona Third Wave, Sarkaru Vari Paata-TeluguStop.com

మొదటి సారి అడవి శేషు హీరోగా మేజర్ అనే సినిమా పట్టాలెక్కింది.పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా ను సోనీ పిక్చర్స్‌ వారు కూడా తెరకెక్కిస్తున్నారు.

మహేష్ బాబు మరియు సోనీ పిక్చర్స్‌ కాంబోలో రూపొందుతున్న మేజర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది.కాని ఇప్పటి వరకు విడుదల విషయంలో అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూనే వస్తున్నారు.

 Adavi Sheshu Movie Major Release Again Postpone Details, Hero Adavi Sesh, Major Movie, Mahesh Babu, Sony Pictures, Post Poned, Corona Third Wave, Sarkaru Vari Paata-ఔను.. మేము కూడా వాయిదా వేస్తున్నాం అంటూ మహేష్ టీం క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ మళ్లీ సినిమా విడుదల వాయిదా వేసేలా చేసింది.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికం గా సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.మహేష్ బాబు నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

కాని ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో అభిమానులు అంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదల తేదీ విషయం లో మళ్లీ గందరగోళం నెలకొనడం తో ఏం చేయాలో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

ఒక వైపు సర్కారు వారి పాట సినిమాను వాయిదాల మీద వాయిదా లు వేస్తున్నారు.సంక్రాంతి రావాల్సిన సర్కారు వారి పాట ను ఏప్రిల్‌ 1 కి వాయిదా వేశారు.ఇప్పుడు ఏప్రిల్‌ 1 వ తేదీన కూడా సినిమా విడుదల చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.దాంతో మహేష్‌ బాబు అభిమానులు అసహనంతో ఉన్నారు.ఇప్పుడు ఔను మేము కూడా వాయిదా వేస్తున్నాం అంటూ మేజర్‌ టీమ్‌ ప్రకటించడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది.

Video : Adavi Sheshu Movie Major Release Again Postpone Details, Hero Adavi Sesh, Major Movie, Mahesh Babu, Sony Pictures, Post Poned, Corona Third Wave, Sarkaru Vari Paata

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube