మేజర్ గా వస్తున్నఅడవి శేష్! రియల్ స్టొరీ కథతో!  

ముంబాయ్ ఉగ్రదాడి నేపధ్యంలో రియల్ స్టొరీ కథతో మేజర్ గా వస్తున్న అడవి శేష్..

Adavi Sesh Announce New Movie Based On Real Story-

గూడచారి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇండియాలో ముంబాయ్ ఉగ్రదాడిలో టెర్రరిస్ట్ లతో వీరోచితంగా పోరాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అనే ఆర్మీ ఆఫీసర్ నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..

Adavi Sesh Announce New Movie Based On Real Story--Adavi Sesh Announce New Movie Based On Real Story-

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇదిలా వుంటే మొదటి సారి ఈ సినిమాతో సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.ఇక ఇందులో హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తూ వున్నాడు.

ఇక ఈ సినిమాని తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే అడవి శేష్ ఈ సినిమా గూడచారి సీక్వెల్ లో భాగంగా తీసుకోస్తున్నాడా, లేక సపరేట్ సినిమాగా వస్తుందా అనేది వేచి చూడాలి.ఏది ఏమైనా మరోసారి అడవి శేష్ ప్రేక్షకుల ముందుకి మరో ఇంటరెస్టింగ్ పాయింట్ తో వస్తున్నాడని తాజాగా ఈ సినిమా పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.