శర్వానంద్‌ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రివ్యూ

శర్వానంద్ హీరో గా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కిషోర్ తిరుమల దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

 Adavallu Meeku Joharlu Movie Preview , Adavallu Meeku Joharlu, Flim News, Movie News, Sharwanand-TeluguStop.com

అందుకు తగ్గట్లే సినిమా ఉంటుందని ట్రైలర్ మరియు ప్రోమోలు చూస్తుంటే అనిపిస్తుంది.ఇక ఈ సినిమా కు ముందు హీరో శర్వానంద్ పరిస్థితి చూస్తే వరుసగా ఫ్లాప్ లు పడ్డాయి.

జాను సినిమా కాస్త ఫర్వాలేదనిపించినా ఆ క్రెడిట్‌ ఎక్కువగా జాను గా నటించిన సమంతకే దక్కింది అనడంలో సందేహం లేదు.ఇక శ్రీకారం మరియు మహా సముద్రం లాంటి సినిమాలు విఫలమయ్యాయి.

శ్రీకారం సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం దారుణమైన ఫలితాన్ని చవి చూడడం జరిగింది.అయినా కూడా శర్వా నంద్ నటించిన సినిమా అని కాకుండా ఒక మంచి సినిమా గా దీన్ని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

Telugu Adavallumeeku, Sharwanand-Movie

ఇక రష్మిక మందన్నా విషయానికి వస్తే ఆమె పుష్ప తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక కచ్చితం గా ఈ సినిమా కు ఆమె అదనపు ఆకర్షణ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమె ఉండడం వల్లే మంచి బిజినెస్ అయింది అని కూడా వార్తలు వస్తున్నాయి.ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా లో ఎంతో మంది ఆడవాళ్లు.అంటే సీనియర్ నటీమణులు కనిపించబోతున్నారు.వారందరి మధ్య శర్వానంద్ చేసే సందడి మరియు రష్మిక మందన్నా క్యూట్‌ నెస్‌ ఎంత మేరకు సినిమా లో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

ఇప్పటికే భీమ్లా నాయక్‌ సినిమా థియేటర్ లో సందడి చేస్తోంది.మరో వైపు వారం రోజుల్లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కనుక ఈ రెండు సినిమాల మధ్య రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కు ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కు లైఫ్ అండ్ డెత్ మేటర్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube