మళ్ళీ టాలీవుడ్ లోకి ఆదాశర్మ.. కాకపోతే ఈసారి?

టాలీవుడ్ తమిళ్ గ్లామర్ బ్యూటీ ఆదా శర్మ గురించి అందరికీ తెలిసిందే.తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Adasharma To Give Big Reentry In Tollywood-TeluguStop.com

అతి తక్కువ సమయంలోనే తన నటనతో పేరు సంపాదించుకొని తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళంలో నటించి ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.

2008లో తొలిసారిగా హిందీలో 1920 అనే హారర్ సినిమా తో సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.ఈ సినిమా ఆదా శర్మకు మంచి విజయాన్ని అందించింది.

 Adasharma To Give Big Reentry In Tollywood-మళ్ళీ టాలీవుడ్ లోకి ఆదాశర్మ.. కాకపోతే ఈసారి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాతోనే అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 2014 లో హీరో నితిన్ సరసన నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలో తెలుగు లో అడుగు పెట్టింది.ఇందులో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.

ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి సినిమా లో నటించగా కొన్ని బుల్లితెర ప్రకటనలను కూడా అందించింది.ఇదిలా ఉంటే కల్కి సినిమా తర్వాత ఆదా శర్మ మొత్తం బాలీవుడ్ సినిమాలకే పరిమితం కాగా మళ్లీ తెలుగు సినిమాలలో అడుగు పెట్టనుందట.

Telugu Adasharma, Bollywood, Kshanam, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఆదా శర్మ నటించిన క్షణం సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోగా ఈ సినిమా విడుదల అయ్యి ఫిబ్రవరి 26 కు ఐదు సంవత్సరాలు కాగా ఈ సందర్భంగా ఆదా శర్మ అభిమానులతో కొన్ని విషయాలు పంచుకుంది.తను ఏ భాషలో చేసిన తనను అందరూ ఆదరించారని, అందుకే అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది.ఇక ఈరోజు అందరితో విషయాన్ని పంచుకుంటున్నానంటూ, తెలుగులో కొత్తగా మరో ఐదు సినిమాలను ఓకే చేశానని తెలిపింది.ఈ వచ్చే సినిమాలన్నీ ప్రయోగ భరితంగా తెరకెక్కనుందని తెలిపింది.

మొత్తానికి హార్ట్ ఎటాక్ బ్యూటీ మళ్లీ అడుగుపెట్టనుందని అర్థంమవుతుంది.

#Kshanam #Adasharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు