ఇండియన్ హాలీవుడ్ హీరో నటుడుకి రైజింగ్ స్టార్ అవార్డు

హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా రీసెంట్ గా నటించిన ది వైట్ టైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అందులో బలరామ్ హల్వాయి పాత్ర చేసిన ఆదర్శ్ గౌరవ్ కచ్చితంగా గుర్తిండిపోతాడు.నెట్ ఫ్లిక్ష్ నిర్మించిన ది వైట్ టైగర్ సినిమాని అరవింద్ అడిగా నవల ఆధారంగా హాలీవుడ్ లో తెరకెక్కింది.

 Adarsh Gourav Bags The Rising Star Award For The White Tiger, Hollywood, Indian-TeluguStop.com

ఈ సినిమా డైరెక్ట్ గా ఒటీటీలో రిలీజ్ అయిన మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.బలరామ్ పాత్రలో నటించిన ఆదర్శ్ గౌరవ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.

సిక్కోలు నుంచి హాలీవుడ్ లో రేంజ్ కి ఎదిగిన ఈ తెలుగు నటుడికి ఇప్పుడు మొదటి సినిమాతోనే అరుదైన గుర్తింపు లభించింది.త్వరలో జరగబోయే బాఫ్టా, ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుల ప్రధాన విభాగంలో నామినేట్ అయిన తరువాత, ఆదర్శ్ కి ఇప్పుడు ఆసియా ప్రపంచ చలన చిత్రోత్సవం ద్వారా రైజింగ్ స్టార్ అవార్డు లభించింది.

మొదటి సినిమాతో ఈ అవార్డు అందుకోవడం ద్వారా ఆదర్శ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.

తనకు దక్కినగౌరవం గురించి ఆదర్శ్ మాట్లాడుతూ ఎడబ్ల్యుఎఫ్ఎఫ్ జ్యూరీ నాకు ఈ అవార్డు ఇవ్వడం ఎంతో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

జ్యూరీ నాకు ది రైజింగ్ స్టార్ అవార్డు ప్రకటించింది అని తెలిసిన వెంటనే ఏదో తెలియని భావోద్వేగానికి గురయ్యాను.నటుడుగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తా.

ఇది నాకు జీవితాంతం గుర్తిండిపోతుందని ఆదర్శ్ తన ఎమోషన్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.మొత్తానికి ఒక ఇండియన్ అది కూడా తెలుగు నటుడుకి ప్రపంచ స్థాయిలో ఈ రకమైన గౌరవం, గుర్తింపు రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube