ఇష్టం లేకుండా ఎవరూ చేయి వేయరు అంటున్న నితిన్ హీరోయిన్

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫిలిం ఇండస్ట్రీలో చాలాకాలంగా కాస్టింగ్ కౌచ్ ఉదంతం నడుస్తున్న సంగతి తెలిసిందే.హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు చాలా మంది మీటూ మాటున చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోల మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు.

 Adah Sharma Open Up On Casting Couch In Film Industry, Tollywood, Bollywood, Ind-TeluguStop.com

తమని లైంగికంగా వేధించారని, అవకాశాలు పేరు చెప్పి బలవంతంగా వాడుకున్నారని మీడియా ముందుకి వచ్చి హడావిడి చేశారు.అయితే ఈ లైంగిక వేధింపుల ఆరోపణలని మహిళలలోనే కొందరు సమర్ధిస్తే, మరికొంత మంది వ్యతిరేకించారు.

సంఘటన జరిగినపుడు ఈ విషయం గురించి ప్రస్తావించకుండా రెండు, మూడేళ్ళ తర్వాత లైంగిక ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని వాదించే వాళ్ళు ఉన్నారు.బాధిత అమ్మాయిలకి మద్దతుగా గళం విప్పిన వాళ్ళు ఉన్నారు.

తాజాగా ఇదే విషయంపై నితిన్ తో హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన అందాల భామ ఆదాశర్మ స్పందించింది.ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో అలరిస్తూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

కాస్టింగ్ కౌచ్‌ కు అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు.ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది.అయితే ఇందులో ఎవరు ఎవరిని బలవంతం చేయరు.

అవకాశాలు పేరు పెట్టి కాస్టింగ్ కౌచ్ కి పాల్పడితే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.మనకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చెయ్యరు.

మహిళలు అన్ని చోట్లా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆదా చెప్పుకొచ్చింది.సరైన నిర్ణయం తీసుకోకుండా తప్పు చేస్తే అవకాశాలు వస్తాయని అనుకునేవారు అలా వెళ్తారు.

వద్దనుకున్న వారు టాలెంట్ ని నమ్ముకుంటారు అని ఆదా శర్మ స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube