తెలుగులో ఐదు సినిమాలు చేస్తున్న ఆదా శర్మ

పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఆదా శర్మ.ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడటంతో ఈ అమ్మడు టాలెంట్ ని ఎవరూ పెద్దగా గుర్తించలేదు.

 Adah Sharma Signed 5 Telugu Movies-TeluguStop.com

ఆ తరువాత హీరోయిన్ గా కుర్ర హీరోలతో కొన్ని సినిమాలు చేసిన సక్సెస్ రాకపోవడంతో ఈ నార్త్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారు.తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీలోకి వెళ్లి ట్రై చేసిన అక్కడ కూడా ఆమెకి అదృష్టం కలిసి రాలేదు.

అయితే తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు ఈ అమ్మడు చేసింది.అయితే ఏదో సోసో పాత్రలు అని కాకుండా అవకాశం వచ్చినప్పుడే చేద్దాం అని ఫిక్స్ అయిపోయి సోషల్ మీడియాలో ఫోటోషూట్ లు, వీడియోలు చేస్తూ అందరికి చేరువ అయ్యింది.

 Adah Sharma Signed 5 Telugu Movies-తెలుగులో ఐదు సినిమాలు చేస్తున్న ఆదా శర్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్ద్జేట్ తో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనలోని టాలెంట్ డాన్స్ టాలెంట్ కూడా బయట పెడుతూ వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు పూర్తి చేసింది.

అందులో ఒకటి క్వచ్చన్ మార్క్ (?) టైటిల్ తో రిలీజ్ కి రెడీ అవుతుంది.సస్పెన్స్ థ్రిల్లర్ గా కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా అంటే క్షణం మూవీ అని చెప్పాలి.అందులో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో ఆదాశర్మ నటించింది.

ఈ సినిమా ఐదు సంవత్సారాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆదా శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 5 కొత్త సినిమాలకు సైన్ చేసినట్లు ప్రకటించింది.క్షణం 5 సంవత్సరాలైన సందర్భంగా నేను 5 తెలుగు చిత్రాలకు సంతకం చేశానని ప్రకటించాలనుకుంటున్నాను.

నేను ఏ భాషలోనైనా ప్రయోగాత్మకంగా ఏ సినిమా చేసినా నాకు సపోర్ట్ చేసి ఆదరించారు.ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా అంతకుముందు నేను చేయనివి.

ఈ ఏడాది ఎక్సయిటింగ్ గా ఉండబోతోంది.భవిష్యత్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆదా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

#Adah Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు