మాల్దీవులు మాయలో హీరోయిన్లు... నాకు ఇండియానే చాలు అంటున్న ఆదా శర్మ  

లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా మాల్దీవులుకి చెక్కేస్తున్నారు.దానిని హాలిడే స్పాట్ క్రింద మార్చేసుకున్నారు.

TeluguStop.com - Adah Sharma Shared Video About Maharajapuram

రెగ్యులర్ గా అక్కడికి వెళ్లి సేద తీరుతున్నారు.తాజాగా కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అక్కడే హనీమూన్ ప్లాన్ చేసుకొని భర్తతో జాలీగా గడిపి ఇండియా తిరిగి వచ్చింది.

ఇక సమంత కూడా భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులు వెళ్ళిపోయింది.అక్కడ సేదతీరుతుంది.

TeluguStop.com - మాల్దీవులు మాయలో హీరోయిన్లు… నాకు ఇండియానే చాలు అంటున్న ఆదా శర్మ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక రీసెంట్ గా హీరో నితిన్ కూడా భార్యతో కలిసి మాల్దీవులు వెళ్లారు.వీళ్ళే కాకుండా టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది ఖాళీ సమయం దొరికితే మాల్దీవులు వెళ్లి అక్కడ ఒక వారం పది రోజులు స్పెండ్ చేసి తిరిగి వస్తున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే మాల్దీవులు ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రెటీలకి బెస్ట్ హ్యాంగోవర్ ప్లేస్ గా మారిపోయింది.

అయితే టాలీవుడ్ లో అందాల భామ ఆదాశర్మకి మాల్దీవులు కంటే మన ఇండియాలోనే అందమైన ప్రదేశాలలో గొప్పగా అనిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న చిన్న గ్రామమైన మహారాజపురానికి సంబంధించిన కొన్ని వీడియోలను అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

షూటింగ్ నిమిత్తం అదా ఆ ప్రాంతానికి వెళ్లింది.అక్కడ ప్రకృతి అందాలను అందరికీ పరిచయం చేసింది.మాల్దీవులు కాదు, మహారాజపురం.అక్కడికి ఎలా వెళ్లాలని అడగకండి.

ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్‌లూ జరగలేదు.నేను చాలా లక్కీ అని పేర్కొంది.

అదా ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.అందులో ఒక సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

రెండో సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు లొకేషన్ నుంచి ప్రకృతి అందాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

#Maldives #Maharajapuram #Adah Sharma #Samantha #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు