తీవ్ర అసంతృప్తిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే..?

1920 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆదాశర్మ.హిందీలో కొన్ని సినిమాల్లో నటించిన ఆదాశర్మ పూరీ జగన్నాథ్ నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాలోని హయతి పాత్రతో తెలుగుతెరకు పరిచయమయ్యారు.

 Adah Sharma Disappoints On Kollywood Industy-TeluguStop.com

ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచినా నటిగా ఆదా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

హార్ట్ ఎటాక్ తరువాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆదాశర్మ చిన్న పాత్రలో నటించారు.

 Adah Sharma Disappoints On Kollywood Industy-తీవ్ర అసంతృప్తిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా హిట్టైనా ఆదా కెరీర్ కు మాత్రం ప్లస్ కాలేదు.ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం సినిమాల్లో నటించిన ఆదాశర్మ తమిళంలో ఇదు నమ్మ ఆళు, ఛార్లీ చాప్లిన్ 2 సినిమాల్లో నటించారు.

ఇదు నమ్మ ఆళు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆదాశర్మకు ఆ పాట పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

అయితే ఇతర భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆదాశర్మ తమిళనాడులో పుట్టి పెరిగినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోలేకపోయారు.

తమిళమ్మాయి అయినప్పటికీ తమిళంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం గురించి తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.తమిళమ్మాయిలకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు ఇవ్వరా.? అంటూ ఆదాశర్మ ప్రశ్నిస్తున్నారు.

గత కొంతకాలంగా పెద్దగా అవకాశాలు లేని ఆదాశర్మ ఈ ఏడాది అయినా వరుస సినిమాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

ఇప్పటికే సల్సా డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్న ఆదాశర్మ ఇతర డ్యాన్స్ లలో కూడా ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది.తెలుగమ్మాయిలు తమకు తెలుగులో అవకాశాలు దక్కడం లేదని ఆరోపణలు చేసినట్లే తమిళమ్మాయి అయిన ఆదాశర్మ తనకు తమిళంలో అవకాశాలు దక్కడం లేదని ఆరోపణలు చేయడం గమనార్హం.

#Adah Sharma #Puri Jagannath #Herat Attack #AdahSharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు