అభినందన్ విడుదల వెనుక అసలు నిజం ఏమిటంటే

మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రకటించమని పదేళ్లుగా పోరు పెట్టినా పట్టించుకోని చైనా ఇప్పుడు ఉన్నట్టుండి మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రకటించింది.దీనికి కారణం అంతర్జాతీయ సమాజపు ఒత్తిడి మేరకు చైనా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Actual Truth Behind The Release Of Abhinandan-TeluguStop.com

గత కొంత కాలంగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాస లో పోరాటం చేస్తుంటే ప్రతిసారి వీటో జారీ చేసి దానిని ఎప్పటికప్పుడు చైనా ఆపుతూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచడం తోనే చైనా చివరికి తలవంచింది.

అయితే పైలట్ అభినందన్ విడుదల వెనుక మా ఘనత ఉందంటూ ఎవరికీ వారు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే దీనిపై స్వీడన్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.

ఆ కధనం లో తెలిపిన వివరాల ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ విడుదల అంత సాఫీగా జరగలేదు.ఆయన విడుదల కు ముందు చాలా పెద్ద కధే నడిచింది.

ఫిబ్రవరి 27 రాత్రి పాకిస్థాన్ ఆర్మీ,అధికారులు అందరూ కూడా నిద్రలేని భయంకరమైన చీకట్లో గడిపారు అని ఆ కధనం లో పేర్కొంది.అలానే ఎఫ్-16 కోల్పోయిన తరువాత అమెరికా చాలా ఆగ్రహంగా ఉంది, అంతేకాకుండా పాక్ ను భారత్ యొక్క ప్రతి చర్యల నుంచి కాపాడాలన్న ఉద్దేశ్యం తో అమెరికా పావులు కదిపినట్లు తెలుస్తుంది.

సిఐఏ తెలిపిన వివరాల ప్రకారం సరిపోల్చుకున్న అమెరికా అభినందన్ ను సురక్షితంగా భారత్ కు అప్పగించాలని భావించింది.మరోపక్క భారత్ పాక్ పై ప్రయోగించడానికి సరిహద్దుల్లో బ్రహ్మ్ స్ మిస్సైల్స్ ను మోహరించడం తో పాటు సుఖోయ్ మిస్సైల్స్ ను కూడా సిద్ధం చేసుకుంది.

అయితే ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధికారులు పాక్ కు ఫోన్ చేసి బ్రహ్మ్ స్ విషయాన్నీ తెలిపి గట్టిగా హెచ్చరించాయి.అభినందన్ ను విడుదల చేయకపోతే తాము ఇచ్చిన ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా తమ రిమోట్ శాటిలైట్ ద్వారా పనిచేయకుండా చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది.

అయితే అప్పటికే ఆభినందన్ నుంచి నిజాలు కక్కించాలని ఐఎస్ఐ రహస్య ప్రాంతానికి తరలించారు.అయితే అమెరికా హెచ్చరిక విషయాన్ని తెలుసుకున్న ఐఎస్ఐ ఖంగుతింది.మరోపక్క వచ్చిన అవకాశం వదులుకోకూడదు అని భావించిన పాక్ సైన్యాధ్యక్షుడు బజ్వా వెంటనే హుటాహుటిన దుబాయ్ వెళ్లారు.కానీ అప్పటికే దుబాయ్,సౌదీ,రష్యా,చైనా కు అమెరికన్ అధికారులు విషయం తెలియజేసి మీరు ఏమాత్రం కలుగజేసుకున్న పరిస్థితి అదుపుతప్పుతుంది అని హెచ్చరించారు.

దీనితో దుబాయ్ అధికారులు భారత్ కు ఫోన్ చేసి ఒక్క రాత్రి ఓపిక పట్టమని కోరింది.

అభినందన్ విడుదల వెనుక అసలు ని

అయితే దుబాయ్ వచ్చిన బజ్వా కు తాము ఎలాంటి సాయం చేయలేమని తేల్చి చెప్పడం తో అటు నుంచే బజ్వా చైనా కు వెళ్లారు.చైనా శాటిలైట్ లింక్ ఇస్తే భారత్ లో ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటామని కోరగా దానికి చైనా నిరాకరించడం తో పాటూ నేరుగా భారత్ తో చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికింది.బజ్వా కంటే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా అధికారులతో మాట్లాడి ఈ విషయంలో మీరు తటస్థంగా ఉంటారని ఆశిస్తున్నాం అంటూ ఒక సందేశం చైనా కు ఇచ్చినట్లు ఆ పత్రిక కధనంలో పేర్కొన్నారు.

దానితో టర్కీ ని ఆశ్రయయించినప్పటికీ అక్కడ నుంచి కూడా సహాయం అందకపోవడం తో చేసేది ఏమి లేక రెండు రోజుల తరువాత అభినందన్ ను భారత్ కు అప్పగించింది.అయితే ఈ రెండు రోజుల సమయంలో పాక్ ఉన్నతాధికారులు అందరూ కూడా తమ నివాసం లో ఏర్పాటు చేసుకున్న అండర్ గ్రౌండ్స్ లోనే తలదాచుకున్నట్లు ఆ పత్రిక కధనంలో పేర్కొంది.

ఈ కధనం తో పాక్ ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో అభినందన్ ను విడుదల చేసింది.దీనిలో పాక్ ఉదారత కానీ,మారేది లేదు అన్న విషయాన్ని ఆ పత్రిక స్పష్టంగా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube