గత కొన్నేళ్లు గా సోషల్ మీడియా లో తెగ యాక్టివ్ గా ఉంటున్న నటి సమీరా రెడ్డి.గర్భవతి గా ఉన్న సమయంలో కూడా తన ఫోటో షూట్లతో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసింది.
అయితే ఇటీవలే ఒక పాపకు కూడా జన్మనించిన ఈ భామ ఇప్పుడు మరో సాహసం చేసి సోషల్ మీడియా లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.తన రెండు నెలల చిన్నారి నైరా ను వెంటేసుకొని పెద్ద సాహసానికే దిగింది.
ఒక బిడ్డకు డెలివరీ అయిన రెండు నెలల్లోనే ఇంతటి సాహసానికి పాల్పడడం తో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇంతకీ సమీరా చేసిన సాహసం ఏమిటంటే కర్ణాటక రాష్ట్రంలోని అతి ఎత్తైన మల్లయన గిరి పర్వతం ఎక్కింది.
తన రెండు నెలల చిన్నారి ని వెంటేసుకొని పర్వతం పైకి వెళ్తుండగా దారి మధ్యలో ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామలో పోస్ట్ చేసింది.ఇది 6300 అడుగుల ఎత్తైన పర్వతం.

ఒక బిడ్డకు డెలివరి ఇచ్చిన తర్వాత ఏ మాత్రం భయపడకుండా తల్లులు మరింత ఎనర్జీతో ముందుకు సాగాలంటూ ఈ వీడియో ద్వారా సందేశాన్ని అందించింది.ప్రస్తుతం సమీరా.తన కూతురితో కలిసి చేసిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారడం తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.