అలాంటి వాళ్ల చేతిలో మోసపోయిన నటి.. ఎవరంటే?

ప్రస్తుతం ప్రజలు అమాయకంగా మోసపోతున్నారు.అది ఏ విషయంలోనైనా కానీ మొత్తానికి మోసగాళ్ల వలలో పడుతున్నారు.

 Actress Who Was Deceived At The Hands Of Such People-TeluguStop.com

ఈమధ్య ఆన్ లైన్ ప్రభావం ఎక్కువగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువుల వరకు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు.

పైగా వాటికి డబ్బులు ముందుగానే చెల్లించడం లేదా తమ ఆర్డర్ చేసిన వస్తువు చేతికి అందాక కూడా చెల్లించవచ్చు.

 Actress Who Was Deceived At The Hands Of Such People-అలాంటి వాళ్ల చేతిలో మోసపోయిన నటి.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Cheat, Delivery Of Alcohol, Online, Shabana Azmi, Social Media, Viral-Movie

ఇక సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఆఫ్ లైన్ షాపింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ఇది ఇలా ఉంటే ఆన్ లైన్ షాపింగ్ ఎంత సులువుగా చేసుకుంటామో.ఆన్ లైన్ దోపిడీ విషయంలో కూడా అంత త్వరగా మోసపోతుంటాము.

ఇప్పటికే చాలామంది ఆన్ లైన్ పేరిట మోసపోతున్నారు. ఇక తాజాగా ఓ నటి కూడా ఆన్ లైన్ మోసాన్ని ఎదుర్కొంది.

బాలీవుడ్ నటి షబానా అజ్మీ గురువారం రోజు ఆన్ లైన్ డెలివరీ సంస్థ లిక్విడ్జ్ లైవింగ్ లో మద్యం కొనుగోలు చేసింది.ఇక డబ్బులు కూడా ముందుగానే చెల్లించింది.

దాంతో వారు ప్రకటించిన సమయం దాటిపోవడంతో తను ఆర్డర్ చేసిన మద్యం రాకపోవడంతో మోసపోయినట్లు గమనించింది.దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని ప్రజలకు జాగ్రత్తలు తెలిపింది.

Telugu Cheat, Delivery Of Alcohol, Online, Shabana Azmi, Social Media, Viral-Movie

తన ట్విట్టర్ వేదికగా.జాగ్రత్తగా ఉండండని, నన్ను వాళ్ళు మోసం చేశారని, లిక్విడ్జ్ లైవింగ్ కు ముందే తను డబ్బులు చెల్లించాలని, అనంతరం తాను పెట్టిన ఆర్డర్ రాకపోవడంతో ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఎటువంటి సమాచారం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది.ప్రస్తుతం తను చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.గతంలో కూడా చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి మోసాలకు లొంగిపోయారు.అంతేకాకుండా సామాన్యులు కూడా తాము ఆర్డర్ చేసిన వస్తువులు బదులు వేరే వస్తువులు వచ్చాయని కూడా గతంలో తెలిపారు.కాబట్టి ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ కంటే ఆఫ్ లైన్ షాపింగ్ లే చేయడం వల్ల ఎటువంటి మోసాలకు లొంగిపోము.

#Social Media #Online #Cheat #Shabana Azmi #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు