భర్తతో విడిపోయి ఐదు సంవత్సరాల తర్వాత తల్లి అయిన నటి..!

హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు.2011 లో హలీవుడ్ హీరో జానీ డెప్‌, అంబర్ హర్డ్ ఇద్దరు రమ్ డైరీ అనే కామెడీ చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత వీరిద్దరూ దాదాపు 4 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు.ఆ తర్వాత 2015లో లాస్ ఎంజెలెస్‌లో ఘనంగా వివాహం చేసుకొన్నారు.ఆ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయ, వ్యక్తిగత బేధాలు రావడంతో 2017లో విరిద్దరూ విడాకులు తీసుకొన్నారు.ఇంకో విషయం ఏంటంటే అంబర్ హార్ట్ జానీ డెప్ కన్నా 22 ఏళ్లు చిన్నది అంట.

 Actress Who Is A Mother After Five Years Of Separation From Her Husband Actress,-TeluguStop.com

అయితే ఇప్పుడు అంబర్ హార్ట్ గురించిన ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఎప్పుడో భర్తతో విడాకులు తీసుకున్న అంబర్ హార్ట్ ఇప్పుడు నేను తల్లిని అయ్యానంటూ తన బిడ్డను అందరికి పరిచయం చేసింది.

ఎప్పుడో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్న అంబర్ ఇప్పుడు తల్లి అవ్వడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు.అసలు భర్త లేకుండా తల్లి అవ్వడం ఏంటి అని ? ఇన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న నువ్వు తల్లి ఎలా అయ్యావు ? అసలు నువ్వు పరిచయం చేసిన బిడ్డకు తండ్రి ఎవరు ? ఎవరితో కాపురం చేసి ఈ బిడ్డని కన్నావు.? అంటూ అంబర్ హార్ట్ పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించేసారు.అసలు అంబర్ పోస్ట్ చేసిన సందేశంలో తాను బిడ్డకు తల్లి ఎలా అయ్యిందో అనే విషయాన్నీ స్పష్టంగా వివరించినప్పటికీ, నెటిజెన్స్ మాత్రం అంబర్ పోస్ట్ ను సరిగా అర్ధం చేసుకోకుండా ఆమెను అపార్ధం చేసుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పోస్ట్ చేసారు.

Telugu Actress, Hollywood, Mother-Latest News - Telugu

నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ చూసి అంబర్ కి బాగా కోపం వచ్చి ఒక రేంజ్ లో మండిపండింది.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ఒక బిడ్డకు తల్లిని అవ్వాలని అనుకున్నా, కానీ అప్పుడు నా కల నెరవేరలేదు.కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.పిల్లలు కనడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం అని, నేను ఎవరితో పిల్లల్ని కంటే అసలు మీకొచ్చిన ఇబ్బంది ఏంటి, నేను పిల్లల్ని కనడం వలన మీకు వచ్చిన నష్టం ఏమిటి అని మండిపడ్డారు.

Telugu Actress, Hollywood, Mother-Latest News - Telugu

అలాగే మీ అందరికి సరోగసి పద్దతి గురించి ఎంత చెప్పిన అర్థం కాని విషయం, అర్థం చేసుకున్న వాళ్ళైతే ఇలా మాట్లాడేవాళ్లు కాదంటూ విరుచుకు పడింది అంబర్.సరోగసి ద్వారా అంబర్ బిడ్డకు తల్లి అయింది.ఇదే పద్దతిలో అప్పట్లో చాలా మంది స్టార్స్ సరోగసి పద్దతి ద్వారా బిడ్డలను పొందిన విషయం మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube