ఆ రీజన్ వల్లే చిరంజీవి విజయశాంతితో ఎక్కువ సినిమాలు చేశారా?

66 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్ గా కనిపిస్తూ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.రీఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Actress Vijayashanti Make More Films With Megastar Chiranjeevi Details, Chiranje-TeluguStop.com

స్ట్రెయిట్ సినిమాల షూటింగ్ ఆలస్యమవుతున్న చిరంజీవి ప్రస్తుతం రీమేక్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమాలలో రాధిక, రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు.

నాలుగు దశాబ్దాలుగా హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న చిరంజీవి మూడు జనరేషన్ల హీరోయిన్లతో కలిసి నటించారు.చిరంజీవితో రాధిక ఎక్కువ సినిమాలు చేసినా చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలే ఎక్కువగా హిట్లుగా నిలిచాయి.1983 సంవత్సరంలో చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో సంఘర్షణ సినిమా తెరకెక్కి హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో విజయశాంతి సెకండ్ హీరోయిన్ కావడం గమనార్హం.

Telugu Chiranjeevi, Gang, Mechanic Alludu, Sangharshana, Vijayashanti, Vijayashn

ఈ సినిమా తర్వాత చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.దేవాంతకుడు, స్వయంకృషి, మహానగరంలో మాయగాడు సినిమాలు సైతం మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు.

Telugu Chiranjeevi, Gang, Mechanic Alludu, Sangharshana, Vijayashanti, Vijayashn

విజయశాంతితో కలిసి నటించిన సినిమాలు సక్సెస్ కావడం వల్లే చిరంజీవి విజయశాంతికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారని తెలుస్తోంది.ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు సైతం ఇష్టపడటంతో దర్శకనిర్మాతలు ఈ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు.ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలు చేస్తున్న విజయశాంతి గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

విజయశాంతి సినిమాలతో మళ్లీ బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube