ఆ సినిమాతోనే నా నటనకు పునాది పడింది.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు?

లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుని తన సినీ కెరీర్ లో విజయశాంతి ఎన్నో విజయాలను అందుకున్నారు.తాజాగా ఒక సందర్భంలో విజయశాంతి నేటి భారతం సినిమాతో తన నటనకు పునాది పడిందని వెల్లడించారు.

 Actress Vijayashanti Comments About Neti Bharatam And Kartyavyam Movies-TeluguStop.com

సుమన్, విజయశాంతి ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటించగా టి.కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారు.ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత పోకూరి వెంకటేశ్వరరావు నిర్మాత కావడం గమనార్హం.

నేటి భారతం సినిమా తర్వాత రోజుల్లో ఇతర భాషల్లో రీమేక్ కావడంతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Actress Vijayashanti Comments About Neti Bharatam And Kartyavyam Movies-ఆ సినిమాతోనే నా నటనకు పునాది పడింది.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు టి కృష్ణ ఆ సినిమాను తనతోనే చేయాలని అనుకున్నారని టి.కృష్ణ తనకు బ్రదర్ లా, టీచర్ లా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రతిఘటన సినిమాకు తాను మొదట డేట్స్ ఇవ్వలేకపోయినానని టి.కృష్ణ మాత్రం ఆ సినిమా కోసం ఇతర హీరోయిన్లను పరిశీలించి చివరకు తనతోనే చేయించారని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Telugu Comments About, Director T Krishna, Husband Srinivas Prasad, Kartavyam, Kiran Bedi Role, Neti Bharatam, Suman, Tollywood, Vijayashanti, Vijayashanti Top Movies-Movie

విజయశాంతి తన సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన కర్తవ్యం సినిమా గురించి మాట్లాడుతూ ఒక దశలో కర్తవ్యం సినిమాను ఆపేయాలని అనుకున్నారని కిరణ్ బేఢి పాత్రను స్పూర్తిగా చేసుకుని కర్తవ్యం సినిమాను తెరకెక్కించారని విజయశాంతి అన్నారు.కర్తవ్యం సినిమా కథను తయారు చేసే సమయంలో కిరణ్ భేడి గారిని కలిశామని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Telugu Comments About, Director T Krishna, Husband Srinivas Prasad, Kartavyam, Kiran Bedi Role, Neti Bharatam, Suman, Tollywood, Vijayashanti, Vijayashanti Top Movies-Movie

తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఆ కథను రాయడంతో పాటు ఒక దశలో సినిమాను ఆపేయాలని అనుకున్నారని అయితే ఆ తర్వాత సినిమా విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు.మోహన్ గాంధీ గారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని అందరం కలిసి పని చేయడంతో కర్త్యవ్యం సినిమా అద్భుతంగా వచ్చిందని విజయశాంతి వెల్లడించారు.

#Suman #Vijayashanti #Kartavyam #Comments #Vijayashanti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు