చావుబతుకుల మధ్య ఒకప్పటి హీరోయిన్..! డబ్బు లేక దీనస్థితిలో ఐసీయూలో!

ఒకవైపు ఆర్ధిక ఇబ్బందులు మరోవైపు అనారోగ్యంతో బాధపడుతోంది కన్నడ నటి విజయలక్ష్మి.తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించారు విజయలక్ష్మి.

 Actress Vijayalakshmi Hospitalised Sister Seeks Monetary Help-TeluguStop.com

కన్నడలో నాగమండల, సూర్యవంశ చిత్రాలతో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన విజయలక్ష్మి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తమిళంలో సూర్యా సరసన ఫ్రెండ్స్ అనే చిత్రంలో నటించారు.

తర్వాత అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సీరియల్స్ కి పరిమితం అయ్యారు.

ఇప్పుడు హై బీపీ కారణంతో చావుబతుకుల మధ్య బెంగుళూరులోని మల్లయ్య హాస్పిటల్ లో ఉన్నారు.

మరోవైపు విజయలక్ష్మి తల్లి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న డబ్బుని మొత్తం ఖర్చు చేయడం వల్ల విజయలక్ష్మి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది.

దాంతో విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన చేసింది.

తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సాయంచేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలనని దీనంగా వేడుకుంది ఉషాదేవి.

విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఫిలించాంబర్ సభ్యులు ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube