విద్యాబాలన్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరనే సంగతి తెలిసిందే.అయితే విద్యాబాలన్ తొలి పారితోషికం మాత్రం కేవలం 500 రూపాయలు కావడం గమనార్హం.

 Actress Vidyabalan First Remuneration Details Here-TeluguStop.com

ఒక సందర్భంలో విద్యాబాలన్ మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.ఫిల్మ్స్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వయంకృషితో విద్యాబాలన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో విద్యాబాలన్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటించినా ఆ సినిమాలతో సైతం ఆమె విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.అద్భుతంగా నటించగల నటి కావడంతో విద్యాబాలన్ కు నటిగా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

 Actress Vidyabalan First Remuneration Details Here-విద్యాబాలన్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షేర్నీ అనే మూవీలో విద్యాబాలన్ నటించగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ లో షేర్నీ రిలీజ్ కానుండగా షేర్నీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విద్యాబాలన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu 500 Rupees, Actress Vidyabalan, First Remuneration, Perni Movie, Photoshoot, Serial Audition, Vidya Balan Bollywood Entry, Vidya Balan Remuneration-Movie

తొలిసారి తాను ఒక టూరిస్ట్ క్యాంపెయిన్ కొరకు కెమెరా ముందుకు వచ్చానని విద్యాబాలన్ తెలిపారు.ఆ ఫోటో షూట్ లో తనతో పాటు తన కజిన్ ఫ్రెండ్ పాల్గొన్నారని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.ఆ ఫోటో షూట్ కొరకు చెట్టు దగ్గర నిలబడి ఫోజులు ఇవ్వాలని అలా ఫోజులు ఇచ్చినందుకు తమకు 500 రూపాయలు పారితోషికంగా లభించిందని విద్యాబాలన్ వెల్లడించారు.ఆ 500 రూపాయలే తన మొదటి సంపాదన అని ఆమె తెలిపారు.

Telugu 500 Rupees, Actress Vidyabalan, First Remuneration, Perni Movie, Photoshoot, Serial Audition, Vidya Balan Bollywood Entry, Vidya Balan Remuneration-Movie

ఆ తరువాత తాను ఒక సీరియల్ లో నటించానని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.సీరియల్ అడిషన్స్ కొరకు తాను అమ్మ, సోదరితో పాటు వెళ్లానని ఆ సీరియల్ అడిషన్స్ కొరకు ఏకంగా 150 మంది రావడంతో తాను ఎంపిక కానని భయపడ్డానని ఆమె తెలిపారు.అయితే లక్ ఉండటంతో ఆ సీరియల్ లో నటించే అవకాశం తనను వరించిందని విద్యా బాలన్ తెలిపారు.

#VidyaBalan #VidyaBalan #500 Rupees #Serial Audition #Photoshoot

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు