పెళ్లి జీవితం గురించి వనిత విజయ్ కుమారే మాట్లాడాలి.. సమంతకు సలహాలు?

సినిమా ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు సుందరిగా గుర్తింపు పొందిన నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నిత్యం తన పెళ్లి, ప్రేమ గురించి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటారు.

 Actress Vanitha Vijay Kumar Comments On Samantha Naga Chaitanya Divorce, Samanth-TeluguStop.com

సీనియర్ నటి నటులైన మంజుల విజయ్ కుమార్ సంతానంగా ఇండస్ట్రీకి వనిత విజయ్ కుమార్ పరిచయమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి పరిచయమైన వనిత చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం తనతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.

ఇలా ఆ తర్వాత మరో రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడు పెళ్లిళ్లు సుందరిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈమె నాలుగో పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించినప్పటికీ అందుకు స్పందించిన వనిత 4 కాకపోతే 40 చేసుకుంటా నీకేమైనా అభ్యంతరమా అని ప్రశ్నిస్తూ తనని కామెంట్ చేసిన వారిపై తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి వనితా సోషల్ మీడియాలో సంచలనమైన కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా సమంత నాగ చైతన్య గురించి గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తూ చివరికి ఆ వార్తలే నిజమని ఈ దంపతులు వారి విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

Telugu Divorece, Naga Chaitanya, Samantha, Tollywood, Vanithachaysam-Movie

వీరి విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్దఎత్తున విడాకుల విషయంలో సమంత తప్పంటూ విడాకులు తీసుకోవడానికి ఆమెకు ఇతరులతో ఎఫైర్లు ఉన్నాయని, తనకు పిల్లలు అంటే ఇష్టం లేక అబార్షన్లు చేయించుకోవడం వల్ల తనకు విడాకులు ఇచ్చారు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి సమయంలోనే సమంతకు తోడుగా తనకు మద్దతు తెలుపుతూ ఎంతో మంది సెలబ్రిటీలు తన నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.

ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయం పై ఖుష్బూ, ప్రకాష్ రాజ్, నటి సురేఖ వాణి, రకుల్, సింగర్ చిన్మయి తదితరులు సమంతకు మద్దతు తెలుపుతూ వారు వారి వ్యక్తిగత విషయాల వల్ల విడాకులు తీసుకున్నారు.

అయితే వారి నిర్ణయాన్ని మనం గౌరవించాలి అంతే కానీ వారిని మరింత బాధ పెట్టకూడదని తెలియజేశారు.ఇదిలా ఉండగా సమంత విడాకుల విషయం పై నటి వనిత విజయ్ కుమార్ స్పందించారు.

ఈ క్రమంలోనే వనిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సమంతకు తనదైన శైలిలో సలహా ఇచ్చారు.

Telugu Divorece, Naga Chaitanya, Samantha, Tollywood, Vanithachaysam-Movie

ఈ క్రమంలోనే వనిత స్పందిస్తూ.సమాజం అన్నది అవాస్తవం జీవితం మనకు ఎంతో విలువైనది కనుక సమాజం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.మన విషయంలో ఏం జరిగినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది కనుక దానిని ఎదిరించి ముందుకు వెళ్ళు అంటూ వనిత విజయ్ కుమార్ సమంతకు మద్దతు తెలుపుతూ తన సలహా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.పెళ్లి, జీవితం గురించి వనిత గారే మాట్లాడాలి అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube