సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కొడుకు మృతి  

Actress Vanisri Son Passed Away - Telugu Abhinay Venkatesh, Actress Vanisri, Vanisri Son, Vanisri Son Dead

గతకొన్నేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న అలనాటి మేటి నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.వాణిశ్రీ కొడుకు డాక్టర్ అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో మరణించడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 Actress Vanisri Son Passed Away

గతకొన్నేళ్లుగా తన కుటుంబ సభ్యులతో కలిసి వాణిశ్రీ చెన్నైలోనే ఉంటున్నారు.వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ చెన్నై అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాడు.

శుక్రవారం రాత్రి అభినయ్ వెంకటేష్‌కు నిద్రలో గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.అభినయ్ వెంకటేష్‌కు ఓ భార్య నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.వాణిశ్రీ ఇంట ఇలాంటి విషాదం నెలకొనడంతో పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.వాణిశ్రీకి కుమారుడితో పాటు అనుపమ అనే కుమార్తె కూడా ఉంది.

సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కొడుకు మృతి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అభినయ్ వెంకటేష్ భార్య కూడా డాక్టర్ కావడం గమనార్హం.ఇక వాణిశ్రీ కొడుకు మరణ వార్త గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు చెన్నైలోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వాణిశ్రీ, గతకొంత కాలంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.కరోనా వైరస్ కష్టకాలంలో వాణిశ్రీ ఇంట ఇలాంటి విషాదం నెలకొనడం కడు శోచనీయం అని పలువురు తమ సంతాపం తెలుపుతున్నారు.

కాగా ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అభినయ్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Vanisri Son Passed Away Related Telugu News,Photos/Pics,Images..

footer-test