తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాలో తాజాగా బాలీవుడ్ లో నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి రాఘవ లారెన్స్ మొట్టమొదటిసారిగా బాలీవుడ్లో దర్శకత్వం వహించబోతున్నాడు.అయితే ఈ సినిమాకు ముందుగా సినిమా టైటిల్ లక్ష్మి బాంబ్ గా ఉన్న పేరు పై ఎన్నో వివాదాలు తలెత్తాయి.
దీంతో ఆ సినిమా పేరును చిత్ర యూనిట్ సభ్యులు లక్ష్మి గా మార్చారు.ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటి ఫ్లాట్ఫామ్ ద్వారా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా.తాజాగా కొందరు నెటిజెన్స్ లక్ష్మి సినిమాలో హీరోగా నటిస్తున్న అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ను టార్గెట్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖన్నా మార్ఫింగ్ ఫోటో ఒకటి బాగా వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి లక్ష్మి సినిమా పోస్టర్లు ట్వింకిల్ ఖన్నా ఫోటోను పెట్టి మార్ఫింగ్ చేశారు నెటిజన్స్.
ఆమె శరీరం మొత్తం బ్లూ కలర్ వేసి నుదిటి పై ఎర్రని బొట్టు పెట్టారు.అంతేకాదు ఆ పోస్టర్ కి ట్వింకిల్ బాంబ్ అని టైటిల్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
అయితే ఈ విషయం ట్వింకిల్ ఖన్నా కు చేరుకోవడంతో ఆమె కాస్త గట్టిగానే స్పందించింది.
తాను మాట్లాడుతూ ఓ మంచి ఫోటో కోసం తాను వెతుకుతున్న సమయంలో ఈ ఫోటో తనకు సహాయం చేసిందని ట్వింకిల్ ఖన్నా తెలిపింది.
అయితే తన ఫోటోకి ఒకరు ట్యాగ్ చేసి థర్డ్ క్లాస్ పర్సన్ అన్నారని, అలాగే మీరు దేవుడి మీద జోకులు వేసి ఎగతాళి చేస్తారా.? అని కామెంట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.అయితే ఇందుకు సమాధానంగా తాను అవును.దేవుళ్లకు జోకులు అంటే చాలా ఇష్టం అని, లేకపోతే నిన్ను ఎందుకు భూమ్మీదికి పంపిస్తాడు అంటూ ఆ ఫోటో క్రియేట్ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ ఆవిడ ప్రశ్నించింది.
ఇక చివరిగా ఏది ఏమైతేనేం.కొత్త స్కిన్ టోన్ తో పాటు తన నుదిటిన పెద్ద బొట్టుతో తాను ఈ దీపావళికి టపాసులా రెడీ అవుతున్నానని ఆవిడ చెప్పుకొచ్చారు.