అలాంటి వాడు దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉంటా అంటున్న త్రిష

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ ఏకంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న కథానాయికల్లో ప్రస్తుతం త్రిష మాత్రమే ఉంది.స్టార్ హీరోలకి జోడీగా నటించే అవకాశం రాకున్నా లేడీ ఒరియాంటెడ్ కథలతో హీరోయిన్ గా త్రిష ఇప్పటికి సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.

 Actress Trisha Opens Up About Her Marriage Plans-TeluguStop.com

తెలుగు సినిమాలు లేకపోవడం మాతృభాష తమిళ్ కి పరిమితం అయినా ఈ అమ్మడు అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అందరిని అలరిస్తుంది.ఇదిలా ఉంటే గతంలో ఈ భామ ఓ వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకొని తరువాత బ్రేక్ అప్ చెప్పేసింది.

ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పటి వరకు చేయలేదు.కెరియర్ పరంగా మంచి జోరు మీద ఉండటంతో అలాంటి ఆలోచనలు జోలికి వెళ్ళలేదు.

 Actress Trisha Opens Up About Her Marriage Plans-అలాంటి వాడు దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉంటా అంటున్న త్రిష-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గత కొంత కాలం కోలీవుడ్ ఓ హాట్ గాసిప్ వినిపిస్తుంది.హీరో శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అని, త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అయితే అవన్నీ వట్టి రూమర్స్ అని త్రిష కొట్టిపారేసింది.ఇదిలా ఉంటే తాజాగా త్రిష ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసింది.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది త్రిష.భవిష్యత్తులో తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.

కాస్త ఆలస్యమైనా వివాహానికి తొందరపడటం లేదని, నచ్చిన తోడు దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండటానికి ఇబ్బందేమీ లేదని చెప్పుకొచ్చింది.వివాహ వ్యవస్థపై తనకు గొప్ప గౌరవముందని, ఏదో ఒక రోజు పెళ్లి వార్తను అభిమానులతో పంచుకుంటానని త్రిష ఆశాభావం వ్యక్తం చేసింది.

#Actress Trisha #Senior Heroines #South Heroines #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు