అలాంటి అబ్బాయిలంటేనే నాకు ఇష్టం.. త్రిష కామెంట్స్ వైరల్..?

ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించిన వార్త కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా త్రిష పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2015 సంవత్సరంలో త్రిష ఒక బిజినెస్ మేన్ తో నిశ్చితార్థం చేసుకుని ఆ తరువాత నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.

 Actress Trisha Loves Clingy Boys But There Is A Big Catch, Big Catch, Clingy Boy-TeluguStop.com

త్రిషతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకున్నా త్రిష మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.పెట్ డాగ్స్ ను త్రిష ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

పెట్ డాగ్స్ యొక్క ఫోటోలను త్రిష సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా త్రిష పెట్ డాగ్ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఒక కొంటె కొటేషన్ ను అభిమానులతో పంచుకున్నారు.

Telugu Big, Clingy, Forty Age, Pet Dog, Tollywood, Trisha-Movie

ఆ కొటేషన్ లో త్రిష తనకు అంటిపెట్టుకుని ఉండే అబ్బాయిలు అంటే ఇష్టమని అయితే వాళ్లకు కచ్చితంగా నాలుగు కాళ్లు ఉండాలని పేర్కొన్నారు.త్రిష పెట్టిన కొటేషన్ ను చూసి ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా.? లేదా.? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.త్రిష ఒక ప్రముఖ హీరోతో ప్రేమలో ఉందని, మరో హీరోను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి.

Telugu Big, Clingy, Forty Age, Pet Dog, Tollywood, Trisha-Movie

నాలుగు పదుల వయస్సుకు చేరువలో ఉన్న త్రిష త్వరలో శుభవార్త చెబుతుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో త్రిష మాత్రం అభిమానులకు షాకిచ్చే విధంగా కొటేషన్లు పెడుతుండటం గమనార్హం.పెట్స్ ను ఎక్కువగా ఇష్టపడే త్రిష రాబోయే రోజుల్లో అయినా పెళ్లి చేసుకుంటారో లేదా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube