అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష..?

కరోనా, లాక్ డౌన్ రూల్స్ వల్ల సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో సెలబ్రిటీల పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కొన్ని రోజుల క్రితం త్రిష ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరిగింది.

 Actress Trisha Comments About Her Marriage-TeluguStop.com

అయితే ఆ ప్రచారంపై త్రిష అస్సలు స్పందించలేదు.తాజాగా త్రిష చేసిన కామెంట్లను పరిశీలిస్తే త్వరలోనే త్రిష పెళ్లి పీటలెక్కబోతుందని అర్థమవుతోంది.

తాజాగా తనకు కాబోయే వ్యక్తి గురించి త్రిష స్పందిస్తూ తనకు అందంగా ఉన్న వ్యక్తి అవసరం లేదని బాగా చూసుకుంటే చాలు అని చెప్పుకొచ్చారు.తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోనని ఆమె వెల్లడించారు.

 Actress Trisha Comments About Her Marriage-అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు అన్ని రంగులలో నలుపు రంగు అంటే ఇష్టమని తనకు కాబోయే వ్యక్తి హీరోలా ఉండాలని తాను కోరుకోవడం లేదని త్రిష చెప్పుకొచ్చారు.కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని ఆమె వెల్లడించారు.

Telugu Comments About Marriage, Star Heroine Trisha, Tamil Hero Shimbu, Tamil Movies, Telugu Movies, Trisha Business Man, Trisha Marriage, Trisha Marriage Update-Movie

త్రిష పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తోటి హీరోయిన్లంతా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాళ్లవుతున్నారు.దీంతో త్రిష కూడా పెళ్లిపై తెగ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.కొన్ని నెలల క్రితం త్రిష కోలీవుడ్ హీరో శింబును పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.త్రిష వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆమె సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

త్రిష పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.త్రిష ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గడంతో పెళ్లిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అయితే త్రిష ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తల పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Trisha Marriage #CommentsAbout #TrishaBusiness #TrishaMarriage #Tamil Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు