ఆ మరణంతో ఒంటరినయ్యా, అందుకే సామ్రాట్‌తో క్లోజ్ గా.! అన్యాయం జరిగింది..! పెళ్లి ఎప్పుడని?  

Actress Tejaswi Opens About Her Relationship With Samrat-

బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.బిగ్‌బాస్‌లో తేజస్వి మదివాడ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.ఒకానొక సందర్భంలో టైటిల్ గెలిచే టాలెంట్ కూడా ఉంది అనుకున్నారు అభిమానులు.కానీ కౌశల్ తో గొడవ పడటంతో …కౌశల్ ఆర్మీ అంతా కలిసి ఆమెని హౌస్ నుండి బయటకి పంపించారు.ఇక ఆమె హౌస్ నుండి బయటకి రావడమే ఆలస్యం..

Actress Tejaswi Opens About Her Relationship With Samrat--Actress Tejaswi Opens About Her Relationship With Samrat-

మీడియా చానెల్స్ రెడీ గా ఉంటాయి ఇంటర్వ్యూ చేయడానికి.అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“నేనసలు బిగ్‌ బాస్‌ ఫస్ట్‌ సీజన్‌కే వెళ్లాల్సింది.కుదరలేదు.తర్వాత ‘మా’ అవార్డ్స్‌ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు బిగ్‌ బాస్‌ -2 కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు.అలా సెకండ్‌ సీజన్‌లో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యాను.నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.

నాన్నకు ఆల్కహాల్‌ ప్రాబ్లమ్‌.దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా.అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా.పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎలా నడుచుకోవాలో తెలీలేదు.

చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్‌ చేశాను.“

సామ్రాట్ తో సంబంధం గురించి చెప్పాలంటే.సామ్రాట్ నాకు 8 సంవత్సరాల క్రితమే పరిచయం.అప్పటికే ఆయనకు పెళ్లి జరిగింది.

సామ్రాట్‌కు, ఆయన భార్యకు వ్యక్తిగత భేదాలు రావడంతో పెళ్లి సమస్యల్లో పడిందనే విషయం హౌస్‌లోనే తెలుసుకొన్నాను.సామ్రాట్ చాలా ఓపెన్‌గా ఉంటాడు.అందుకే మా మధ్య మంచి బంధం ఏర్పడింది.

ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా ఉంటే తప్పా.అది నా వ్యక్తిగతం.

దానికే సోషల్ మీడియాలో బూతులు తిడతారా? అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తారా?

హౌజ్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు.బయటకు వచ్చాక తెలిసింది కొంతమందైతే సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు.ఒక మనిషితో ఉన్న క్లోజ్‌నెస్‌ను పెళ్లితో ముడిపెడతారా? సామ్రాట్‌ నాకు మంచి ఫ్రెండ్‌ ఎప్పటికీ.

డౌటే లేదు” అని తేజస్వి క్లారిటీ ఇచ్చింది.