తాప్సీని చెత్త హీరోయిన్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..?  

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ.తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ప్రభాస్ కు జోడిగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తాప్సీకి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Actress Tapsee Strong Reply To Netizen Comments

ఆ తరువాత తాప్సీ నటించిన దరువు, గుండెల్లో గోదారి, సాహసం సినిమాలు హీరోయిన్ గా తాప్సీ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

అయితే స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ సినిమాల్లో తాప్సీ ఎక్కువగా నటిస్తోంది.

TeluguStop.com - తాప్సీని చెత్త హీరోయిన్ అన్న నెటిజన్.. దాంతో ఆమె..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్న తాప్సీ తాజాగా ఒక నెటిజన్ కామెంట్ కు ఘాటుగా జవాబిచ్చి వార్తల్లోకెక్కింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ తాజాగా అథ్లెట్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే సినిమాలో నటిస్తోన్న తాప్సీ ఈ సినిమా కోసం మైదానంలో శ్రమిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తాప్సీని దారుణంగా విమర్శించారు.ఒక నెటిజన్ తాప్సీ గ్లామర్ షో వల్ల హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటోందని ఆమెకు నటన రాదని పేర్కొన్నారు.తాప్సీలో స్పెషాలిటీ ఏమీ లేదని ఫాల్తూ హీరోయిన్ అని ఆ నెటిజన్ కామెంట్ చేశారు.

హిట్టయ్యే సినిమాలను ఎంచుకుని మరీ తాప్సీ సినిమాలను చేస్తోందని అందువల్లే హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.నెటిజన్ కామెంట్ గురించి నటి తాప్సీ ఘాటుగా స్పందించారు.

తాను సినిమాల్లో తన ప్రతిభను మాత్రమే చూపించానని ఆ ప్రతిభను నువ్వు చూడలేకపోయావని నెటిజన్ కు కౌంటర్ ఇచ్చారు.తాను ఎంచుకుని సినిమాలు చేయడం లేదని ఇమేజ్ ను పెంచుకునే సినిమాలను చేస్తున్నానని పేర్కొన్నారు.

#Hit Movies #Taapsee Movies #ActressTaapsee #Tapsess #StrongReply

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు