తనకు ఆ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ లేదంటున్న మిల్కీ బ్యూటీ...

మామూలుగా  సెలబ్రిటీల గురించి ఏదైనా పుకారు వినిపించింది అంటే కొందరు ఏమి ఆలోచించకుండా ఆ పుకారుకి మరో వంద వార్తలను జోడించి కథలను అల్లేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య వార్తలను ప్రచారం చేస్తుంటారు.తాజాగా తనపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు గురించి మిల్కీబ్యూటీ తమన్నా స్పందిస్తూ తన గురించి తప్పుడు వార్తలను, అసత్య ప్రచారాలను చేస్తున్నటువంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Tamanna, Tollywood Actress, Love Affair  Pakistan Cricketer, Abdul Razak-TeluguStop.com

అయితే ఇంతకీ విషయం ఏంటంటే గత కొద్దికాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ప్రేమాయణం సాగిస్తుందని అంతేగాక తొందరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.అలాగే ఈ విషయానికి సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

దీంతో తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది.ఇందులో భాగంగా తనకు మరియు ప్రతి పాకిస్థానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్  మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదంటూ స్పష్టం చేసింది.

అంతేగాక ఇక తాము ఇద్దరూ అప్పట్లో దుబాయ్ లో జరిగినటువంటి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నామని ఆ సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలను కొందరు ఇలా తమ గురించి దుష్ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ఇంకోసారి తన గురించి ఇలాంటి వార్తలను పబ్లిష్ చేస్తే కచ్చితంగా చట్టపరమైన అటువంటి చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్నా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నటువంటి సీటీమార్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే దట్ ఈజ్ మహాలక్ష్మి అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube