తాప్సీ పెళ్లి కండీషన్లు ఇవే.. అలాంటి అబ్బాయే కావాలంటూ..?

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తాప్సీ తన యాక్టింగ్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.తాప్సీ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు కాగా తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Heroine Taapsee Pannu Opens Up About Her Marriage Plans, Interesting Comments, M-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ పన్ను తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాను మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తి తనతో పాటు తన కుటుంబానికి కూడా నచ్చాలని ఆమె అన్నారు.

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కూడా కలిసిపోవాలని ఆమె చెప్పుకొచ్చారు.తాప్సీ తల్లిదండ్రులు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతుండటం గమనార్హం.బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న తాప్సీ తాను డేటింగ్ చేసిన వ్యక్తులతో కూడా ఇవే విషయాలను చెప్పానని తెలిపారు.

Telugu Mathews, Taapsee, Taapsee Pannu-Movie

తనకు రిలేషన్ షిప్ విషయంలో టైమ్ పాస్ చేయడం అస్సలు నచ్చదని తాప్సీ తెలిపారు.ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను రిలేషన్ షిప్ కొరకు సమయం కేటాయించడం జరుగుతుందని ఆమె అన్నారు.తాను పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

పెళ్లి చేసుకోమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారని అబ్బాయి ఎవరైనా పర్లేదని వాళ్లు చెబుతున్నారని తాప్సీ చెప్పుకొచ్చారు.

Telugu Mathews, Taapsee, Taapsee Pannu-Movie

కెరీర్ గురించి మాట్లాడిన తాప్సీ ఆరు సినిమాలు చేస్తే తనకు సమయం అస్సలు ఉండదని సినిమాల సంఖ్య తగ్గితే వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం పెరుగుతుందని ఆమె అన్నారు.మరోవైపు తాప్సీ మాథ్యూస్ బోతో డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.తాప్సీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube