తాప్సీ పెళ్లి అప్పుడే.. వరుడు కూడా అతడే!

టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.తన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ అందుకుంది.తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది తాప్సీ.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన పోస్టులను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

 Star Actress Taapsee Pannu Gave Clarity On Her Marriage Issue, Bollywood, Marria-TeluguStop.com

2010లో ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ తొలి నటనతో మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక 2011 లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బాగా సెటిల్ అయిపోయింది.ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించింది.ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి.

ఈ మధ్య ఇండస్ట్రీకి చెందిన నటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Telugu Bollywood, Mathias, Taapsee Mathias, Taapsee, Taapsee Pannu, Tollywood-Mo

ఇక తాజాగా తాప్సీ పెళ్లి వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి.ఇటీవలే డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ తో ప్రేమలో ఉన్నట్లు బాగా వార్తలు వినిపించాయి.ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి స్పందించిన తను.సినీ రంగానికి చెందిన వాళ్లని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

Telugu Bollywood, Mathias, Taapsee Mathias, Taapsee, Taapsee Pannu, Tollywood-Mo

రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలని కోరుకుంటుంది.ఇక తనకు మాథ్యూస్ బాగా తెలిసిన వ్యక్తి అని, మంచి సన్నిహితంగా ఉండే వ్యక్తి అని తెలిపింది.మొత్తానికి తను పెళ్లి గురించి స్పందించగా బహుశా మాథ్యూస్ తోనే పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది.ఇక తను సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నానని, ఆ సంఖ్య రెండు లేదా మూడు వరకు వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని మనసులోని మాటను బయట పెట్టింది.

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube