అతడే నా ఫస్ట్ క్రష్ అంటున్న తాప్సీ ..?  

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ వరుస ఫ్లాపుల వల్ల అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చిన సంగతి తెలిసిందే.ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చిన తాప్సీ అనంతరం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Actress Taapsee Comments About Her First Crush

ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్రష్ గురించి ప్రశ్న ఎదురు కాగా తాప్సీ ఆ విషయాలను పంచుకున్నారు.

ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఎప్పటికీ మధురమైన జ్ఞాపకం అని తాప్సీ అన్నారు.

TeluguStop.com - అతడే నా ఫస్ట్ క్రష్ అంటున్న తాప్సీ ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తను కూడా ప్రేమలో పడ్డానని.తొమ్మిదో తరగతిలోనే తాను ఒక అబ్బాయిని ఎంతో ఇష్టపడ్డానని తాప్సీ చెప్పారు.

ఆ అబ్బాయే తన ఫస్ట్ క్రష్ అని అతను కూడా తనను ఎంతో ఇష్టపడ్డాడని తెలిపారు.కానీ ప్రేమలో పడితే సరిగ్గా చదవలేనని అర్థమైందని అందుకే ఆ అబ్బాయితో మాట్లాడటం మానేశానని అన్నారు.

Telugu Actress Taapsee, First Crush, Interesting Comments, Lady Oriented Films-Movie

కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి గుర్తొచ్చాడని.తాను తొమ్మిదో తరగతి చదివే సమయంలో సెల్ ఫోన్లు లేవని.పబ్లిక్ ఫోన్ నుంచి ఆ అబ్బాయికి ఫోన్ చేసి కాల్ లోనే తెగ ఏడ్చేశానని వెల్లడించారు.తొలి ప్రేమ ఎప్పటికీ తీపి జ్ఞాపకమే అని తాప్సీ పేర్కొన్నారు.

కరోనా వల్ల ఇంట్లో ఉండి బోర్ కొట్టిందని అందుకే మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లానని మళ్లీ షూటింగ్ లతో బిజీ కానున్నానని తెలిపారు.

గ్లామర్ రోల్స్ విషయంలో తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని ఆ రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతానని తాప్సీ వెల్లడించారు.

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకోలేకపొయిన తాప్సీ బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కావడం గమనార్హం.ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ ఆ సినిమాలతోనే పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

#First Crush #LadyOriented #Actress Taapsee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు