రూపాయి కూడా సాయం చేయలేదు.. సురేఖవాణి ఎమోషనల్..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన సురేఖవాణికి ఈ మధ్య కాలంలో నటిగా ఆఫర్లు తగ్గాయి.మరోవైపు సురేఖవాణి రెండో పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

 Actress Surekha Vani Emotional In Alitho Saradaga Show-TeluguStop.com

ఆ వార్తలపై సురేఖ వాణి స్పందించి తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టతనిచ్చారు.తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరైన సురేఖవాణి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నటిగా కెరీర్ ను ప్రారంభించి 22 సంవత్సరాలు అయిందని సురేఖవాణి చెప్పారు.

 Actress Surekha Vani Emotional In Alitho Saradaga Show-రూపాయి కూడా సాయం చేయలేదు.. సురేఖవాణి ఎమోషనల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన బాబాయ్ సిటీ కేబుల్ లో పని చేసేవారని ఆ తరువాత యాడ్స్, సినిమా ప్రోగ్రామ్ లు, ఇంటర్వ్యూలు అని చెప్పారు.

రెండో పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ చేసుకోబోయే వ్యక్తి ఎవరో కూడా మీరే చెప్పండని డబ్బులు ఉండే వ్యక్తిని చూడమని ఆ వార్తలకు సమాధానం ఇచ్చానని ఆమె అన్నారు.ఆ తరువాత అలీ డబ్బు ఉన్న వ్యక్తి కావాలా.? మనస్సు ఉన్న వ్యక్తి కావాలా.? అని అడగగా మనస్సుతో పనులు జరగవని అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.

పెళ్లి కాకముందు మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ గారితో తాను నటించానని సురేఖ వాణి చెప్పుకొచ్చారు.అత్తింటి కుటుంబ సభ్యులు కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల తమకు దూరంగా ఉంటున్నారని సురేఖ వాణి తెలిపారు.ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వాళ్ల నుంచి తమకు రూపాయి కూడా సహాయం అందలేదని ఆమె పేర్కొన్నారు.తనను, తన కూతురును అత్తింటి కుటుంబ సభ్యులు బ్లేమ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

భర్త మరణం విషయంలో తనదే తప్పనే విధంగా నిందలు వేశారని తనను, తన కూతురును అన్నందుకు వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలని సురేఖవాణి చెప్పుకొచ్చారు.రక్తం గడ్డ కట్టడం వల్ల భర్త చనిపోయారని చెబుతూ సురేఖ వాణి ఎమోషనల్ అయ్యారు.

మే నెల 10వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#Helping Nature #Jackey Shroff #Daughter's #Second Marriage #Emotional

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు