కరోనా కష్టాలతో ఫ్రూట్స్ అమ్ముకుంటున్న నటి

గత రెండేళ్ళ నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విలయతాండవం చేస్తుందో అందరికి తెలిసిందే.కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగాలని కోల్పోయి ఆర్ధికంగా కుదేలైపోయారు.

 Actress Sunitha Boya Turned As A Fruit Seller Due To Corona-TeluguStop.com

భారతదేశంలో అయితే వలస కార్మికులు కరోనా కారణంగా పూర్తిగా రోడ్డున పడే పరిస్థితికి వచ్చేశారు;.ఎన్నో రంగాల మీద కరోనా ప్రభావం చూపించింది.

లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.అలాగే కంపెనీలు లక్షల కోట్ల రూపాయిల ఆదాయాన్ని పోగొట్టుకున్నాయి.

 Actress Sunitha Boya Turned As A Fruit Seller Due To Corona-కరోనా కష్టాలతో ఫ్రూట్స్ అమ్ముకుంటున్న నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే కరోనా కష్టాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పాలి.రెండేళ్ళ నుంచి సినిమా షూటింగ్ లు సరిగా జరగకపోవడంతో వాటిపై ఆధారపడి బ్రతుకుతున్న చిన్న చిన్న టెక్నిషియన్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు అందరూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు.

Telugu Actress Sunitha Boya, Corona, Corona Second Wave, Junior Artists, Tollywood-Movie

కొంత మంది అయితే పూటగడవని పరిస్థితి.వాళ్ళకి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియకపోవడంతో రోజువారి జీవితాన్ని నెట్టుకురావడానికి కూడా చాలా మందికి కష్టంగా మారిపోయింది.ఇక ఈ దెబ్బకి కొంత మంది జూనియర్, డైలాగ్ ఆర్టిస్ట్ లు అందరూ కూడా వేరొక వృత్తిని ఉపాధి కోసం ఎంచుకున్నారు.అలా సునీత బోయ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్ముకుంటుంది.

చాలా చిత్రాలలో డైలాగ్ ఆర్టిస్ట్ గా చేసిన సునీత బోయ ఆ మధ్య కత్తి మహేష్ ఇష్యూలో మీడియాలో కూడా ఎక్కువగా హడావిడి చేసింది.దాంతో అందరికి ఆమె పేరు భాగా తెలిసిపోయింది.

కత్తి మహేష్ మీద వేధింపుల ఆరోపణలు చేసి వారి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణని బయటపెట్టింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నటి చేతిలో సినిమాలు లేక ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ కెమెరాకి చిక్కింది.

#Corona #ActressSunitha #Junior Artists

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు