దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి సుమలత (Sumalatha) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈమె ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తన భర్త అంబరీష్ (Ambirishan) బాటలోనే ఈమె రాజకీయాలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే ఇకపోతే సుమలత అంబరీష్ కుమారుడు అభిషేక్ అంబరీష్ (Abhisekh Ambirishan) గత కొద్దిరోజులుగా ఎంతో ఘనంగా నిశ్చితార్థం (Engagement) జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని నేడు అభిషేక్ అంబరీష్ వివాహం జరగబోతుంది.
జూన్ 5, 6వ తేదీలలో ఈయన వివాహం బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరగబోతుంది.ఇక నేడు ఈయన హల్ది (Haldi) వేడుకలను కూడా చాలా ఘనంగా జరిపినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే హల్దీ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendera Modi) హాజరవుతారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరు కాబోతున్నారని సమాచారం.
అభిషేక్ అంబరీష్ గత కొద్దిరోజులుగా ఫ్యాషన్ డిజైనర్ అవివా(Avivaa) బిద్దప్ప ప్రేమలో ఉన్నారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలియజేయడంతో వీరు పెళ్లి పనులు మొదలయ్యాయి.అయితే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
అయితే జూన్ 5,6 తేదీలలో వీరి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం అభిషేక్ అంబరీష్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.