ఆమెకు మాత్రం అమ్మగా చేయనని తెగేసి చెప్పేశా.. సుధ కామెంట్స్ వైరల్!

సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు అమ్మ పాత్రల్లో నటిస్తూ సుధ నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.నటి సుధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు సినిమాలలో నటించడం అలసటగా అనిపించలేదని సుధ అన్నారు.

 Actress Sudha Interesting Comments About Mother Roles Details, Actress Sudha, Mo-TeluguStop.com

రోడ్ సైడ్ లో ఉండే షాపులో కొనుక్కొని తినాలని తనకు కోరిక అని బయట తిరగాలని తన కోరిక అని సుధ తెలిపారు.తనకు పూజలు అంటే చాలా ఇష్టమని సుధ పేర్కొన్నారు.

సెప్టెంబర్ లో తన పుట్టినరోజు ఉందని ఆ సమయంలో పుణ్యక్షేత్రానికి వెళ్లి ఒక పొలిటీషియన్ కంటే తన ఫోటోలకు ఫోటోగ్రాఫర్లు ప్రాధాన్యత ఇచ్చారని ఈ గుర్తింపు దేవుడు ఇచ్చిన వరం అని సుధ అన్నారు.రెండు మూడు సినిమాలకు అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం జరిగిందని సుధ పేర్కొన్నారు.

తన వల్ల నిర్మాతలకు ప్రాబ్లమ్ అయితే ఇన్నిరోజులు ఇండస్ట్రీలో తాను కొనసాగేదానిని కాదని సుధ అన్నారు.

సుధాకర్ రెడ్డి గారు ఒక సినిమాలో ఒకరికి మదర్ క్యారెక్టర్ చేయాలని అడిగారని తాను నాగార్జున, బాలకృష్ణలకు అమ్మ పాత్రలలో నటించానని వాళ్లకు అమ్మగా చేశానంటే తాను చెప్పుకోగలనని ఆమెకు మాత్రం అమ్మ పాత్రలో చేశానంటే చెప్పుకోలేనని తాను అన్నానని సుధ పేర్కొన్నారు.

Telugu Actress Sudha, Actresssudha, Balakrishna, Jr Ntr, Mother, Nagarjuna, Nith

ఆ నటి పేరు తాను చెప్పనని సుధ అన్నారు.మదర్ గా చెయ్యడం సమస్య కాదని కొంతమంది ఆర్టిస్ట్ లకు మదర్ గా చేస్తే ఎందుకు చేశావని అడుగుతారని సుధ తెలిపారు.

Telugu Actress Sudha, Actresssudha, Balakrishna, Jr Ntr, Mother, Nagarjuna, Nith

జూనియర్ ఎన్టీఆర్, మహేష్, నితిన్ లకు మదర్ గా చేశానని సుధ చెప్పుకొచ్చారు.కెమెరా ముందుకు వస్తే క్యారెక్టర్ గురించి ఆలోచిసానని సుధ పేర్కొన్నారు.తనకు సెట్ లో కోపం వస్తే ప్రళయం అని ఏడుస్తూ అక్కడినుంచి వెళ్లిపోతానని సుధ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube