ఆస్తిని దానం చేసిన ఈ ప్రముఖ నటి గురించి మీకు తెలుసా?

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇతర భాషల్లో 800కు పైగా సినిమాలలో నటించి నటిగా శ్రీవిద్య మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సపోర్టింగ్ రోల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో చేసిన ఈ నటి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్బుతంగా నటించేవారు.

 Actress Srividya Special Story Telugu Actress Srividya Birth Anniversary Special-TeluguStop.com

శ్రీవిద్య నటి అయినప్పటికీ ఎన్నో మంచి పాటలు పాడటంతో పాటు డబ్బింగ్ చెప్పడం ద్వారా అభిమానులకు ఆమె మరింత చేరువయ్యారు.

మద్రాస్ లో 1953 సంవత్సరంలో జన్మించిన శ్రీవిద్య బాల్యంలో ఆర్థిక కష్టాలను అనుభవించారు.

శ్రీవిద్య అందంగా ఉండటంతో ఆమెకు కొన్ని మంచి సంబంధాలు వచ్చినా డబ్బు లేకపోవడం వల్ల ఆ సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీవిద్య బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా నటించడం గమనార్హం.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత గాత్రంతో శ్రీవిద్య మరింత ఎక్కువమంది అభిమానులకు చేరవయ్యారు.

Telugu Actresssri, George Thomas, Kamal Haasan, Srividya-Movie

స్టార్ హీరో కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ శ్రీవిద్య కొన్ని కారణాల వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్ ను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రీవిద్య విడాకులు ఇచ్చారు.ఆ తర్వాత భరతన్ అనే మరో డైరెక్టర్ ను వివాహం చేసుకొని భరతన్ ఆమె ఆస్తులు లాగేసుకోవడానికి ప్రయత్నించడంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించారు.

Telugu Actresssri, George Thomas, Kamal Haasan, Srividya-Movie

2003 సంవత్సరంలో క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద సంగీత, నృత్య కళాకారులకు స్కాలర్ షిప్ అందేలా ఏర్పట్లు చేశారు.మిగిలిన ఆస్తిని పనివాళ్లకు, బంధువులకు, సొంత ఊరికి దానం చేసి 53 సంవత్సరాల వయస్సులో ఆమె కన్నుమూశారు.తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube