కోడిగుడ్డు కుళ్లిపోయినా జగనే కారణమా.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..?

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచారు.

 Actress Srireddy Vulgar Comments On Mp Raghurama Krishnam Raju-TeluguStop.com

తనకు రాజులంటే చాలా ఇష్టమని రాజులు గౌరవంగా ఉండటంతో పాటు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుందని శ్రీరెడ్డి అన్నారు.

సాయం చేయడం విషయంలో రాజులు నిజంగా రాజుల్లానే ఉంటారని కానీ ఈయన మాత్రం వేరని శ్రీరెడ్డి అన్నారు.

 Actress Srireddy Vulgar Comments On Mp Raghurama Krishnam Raju-కోడిగుడ్డు కుళ్లిపోయినా జగనే కారణమా.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతను ఒక ఎంపీ అని అతని సమస్య ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు.తాను తిట్టే తిట్లు ఎవరికీ సంబంధం లేవని దయచేసి ఎవరూ ఫీలైపోయి కేసులు పెట్టవద్దని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

పార్టీ గుర్తుపై గెలిచి ఈ డ్రామాలు ఏమిటని పార్టీ నచ్చని పక్షంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపొమ్మని శ్రీరెడ్డి సలహా ఇచ్చారు.

ఎంపీగా ప్రజల సమస్యలను పట్టించుకోని నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ ను ఎందుకు ప్రశ్నిస్తున్నావని శ్రీరెడ్డి మండిపడ్డారు.పాలు ఇచ్చే గేదెలా ఉన్నావని అందరినీ బాడీ షేమింగ్ చేసే నీకు అన్నీ సాగిపోయాయంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ధైర్యం ఉంటే రోడ్డుపైకి వచ్చి మాట్లాడాలని దమ్ముంటే నియోజకవర్గంలో తిరగాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే నీకు విగ్గు కావాలా ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కోడి గుడ్లు కుళ్లిపోయినా నువ్వు జగనే కారణమని చెబుతావని ఛానెల్ వాళ్లు ఇలాంటి వాళ్లనే కూర్చోబెట్టి మాట్లాడతారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

కులాల ప్రస్తావన ఎందుకని ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనా.? అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.శ్రీరెడ్డి విమర్శలపై వైసీపీ ఎంపీ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

#Goes Viral #Vulgar Comments #MPRaghurama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు