13 ఏళ్లకే రజినీకాంత్ కి తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమాలో అంటే?  

Actress Sridevi acted as Stepmother of Rajinikanth, actress sridevi, rajinikanth, kamal haasan, 13 years sridevi, mother character - Telugu 13 Years Sridevi, Actress Sridevi, Actress Sridevi Acted As Stepmother Of Rajinikanth, Kamal Haasan, Mother Character, Rajinikanth

అందాల తార అతిలోక సుందరి.దివి నుంచి దిగివచ్చిన దేవకన్య.

TeluguStop.com - Actress Sridevi Acted As Rajinikanth Stepmother

అందం, అభినయంతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంది శ్రీదేవి.లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అందాల తార తొలిసారి తమిళంలో కన్దన్ కరుణై తో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తెలుగు, మళయాళి, హిందీ సినిమాల్లో అగ్రహీరల సరసన యాక్ట్ చేసింది.
తమిళంలో రజినీ – కమల్ హాసన్, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హిట్ ఫెయిర్ గా నిలిచింది.

TeluguStop.com - 13 ఏళ్లకే రజినీకాంత్ కి తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమాలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తెలుగులో అందరి హీరోలతో యాక్ట్ చేసిన శ్రీదేవి ఎన్టీఆర్ కు మనవరాలిగా, అదే ఎన్టీఆర్ తో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమెకే సాధ్యమైంది.దర్శకేంద్రకులు రాఘవేంద్రరావు డైరక్షన్ లో ఎక్కువ సినిమా చేసిన శ్రీదేవి…, ఎన్టీఆర్ తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక, సూపర్ స్టార్ కృష్ణ తో కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు చిత్రాలతో అభిమానుల్ని అలరించారు.

అయితే శ్రీదేవీ నటించిన చిత్రాల్లో 1976లో కే.బాలచందర్ డైరక్షన్ లో విడుదలైన ‘మూండ్రు ముడిచ్చు’ సినిమా ప్రత్యేకమనే చెప్పుకోవాలి.ఎందుకంటే 13ఏళ్ల వయస్సులో రజినీకి సవితి తల్లిగా శ్రీదేవి యాక్ట్ చేసింది.ఈ సినిమా తమిళ చిత్రసీమకే మంచి పేరు తెచ్చి పెట్టింది.ముఖ్యంగా ఈ సినిమా తరువాత రజినీ, కమల్, శ్రీదేవి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది.దీనంతటికి కారణం సినిమాలోని శ్రీదేవి క్యారక్టర్ ఈ చిత్రంలో రజినీ – కమల్ హాసన్.

ఇద్దరు శ్రీదేవిని ప్రేమిస్తారు.శ్రీదేవి మాత్రం కమల్ హాసన్ ను పెళ్లి చేసుకుంటుంది.

ఆ తరువాత కమల్ మరణిస్తాడు.కమల్ మరణానికి కారణం రజిని అని తెలిసి అతని తండ్రిని పెళ్లాడుతుంది.

#Actress Sridevi #ActressSridevi #Kamal Haasan #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Sridevi Acted As Rajinikanth Stepmother Related Telugu News,Photos/Pics,Images..