షన్ను గెలుపుకోసం రంగంలోకి దిగిన శ్రీరెడ్డి.. శ్రీరామచంద్ర రాసలీలలు తెరపైకి?

Actress Sri Reddy Support To Shanmukh Jaswanth

బిగ్ బాస్ షో గురించి, అందులో ఉన్న కంటెస్టెంట్ ల గురించి పలు సందర్భాలలో శ్రీ రెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.ఈ సీజన్ ప్రారంభంలో కూడా సింగర్ శ్రీరామ్ చంద్రతో తనకున్న పరిచయాలను పబ్లిక్ చేస్తూ అతని గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకునేలా చేసింది.

 Actress Sri Reddy Support To Shanmukh Jaswanth-TeluguStop.com

అలాగే టాలీవుడ్ లో పలువురు బాగోతాలను బయటపెడుతూ.అలాంటి పని కోసం తనతో చాట్ చేసిన వాళ్ల లిస్టు మొత్తం బయట పెట్టింది.

ఆ లిస్టులో దగ్గుబాటి అభిరామ్, వైవా హర్ష, సింగర్ శ్రీరామ్ చంద్ర, లారెన్స్ ఇలా పెద్ద లిస్టే బయటకు పెట్టేసింది.

 Actress Sri Reddy Support To Shanmukh Jaswanth-షన్ను గెలుపుకోసం రంగంలోకి దిగిన శ్రీరెడ్డి.. శ్రీరామచంద్ర రాసలీలలు తెరపైకి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీ రెడ్డితో శ్రీరామ్ చేసిన చాటింగ్ బయటకు రావడంతో అందరు నోరెళ్ల పెట్టారు.

శ్రీరామ్, శ్రీ రెడ్డి చాటింగ్ లకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఈ విషయం పై ఇటీవల స్పందించింది శ్రీరెడ్డి.అయితే తాజాగా మరోసారి బిగ్ బాస్ షో గురించి స్పందిస్తూ శ్రీరామ్ చంద్రకి ఓటు వేయొద్దని కోరింది.

మరి ఎవరికి ఓటు వేయమంటావ్ అని అడగగా.హా ఉన్నాడుగా.

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.అతనికి గట్టిగా ఓట్లు గుద్దండని చెప్పింది.బిగ్ బాస్ షోపై చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి.విలువలు మర్చిపోయి ఈ షోని ప్రసారం చేస్తున్నారు.వ్యక్తిత్వాలు దిగజార్చుకుని ప్రవర్తిస్తున్నారు.దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది.

బిగ్ బాస్ షోని ఆపేయండి అని చెప్తున్నారు.

బిగ్ బాస్ వల్ల పిల్లలు తప్పుదోవలోకి వెళ్లిపోతున్నారు అని చాలా మంది అంటున్నారు.

బిగ్ బాస్‌లో కొన్నింటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా.పిల్లలు చూస్తున్నారనే కామన్ సెన్స్ కూడా లేకుండా.అసభ్యకరమైన వాటిని కనీసం ఎడిటింగ్ చేయకుండా ప్రసారం చేస్తున్నారు.కంటెస్టెంట్ ల విషయానికి వస్తే.శ్రీరామ చంద్రకి ఓటు వేయొద్దని కోరుతున్నా.దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

శ్రీరామ చంద్ర ఫేక్ పర్సన్.వ్యక్తిత్వం లేని వ్యక్తి.

ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.అతను చాలా టాలెంటెండ్ అని నా ఫేస్ బుక్‌లో చాలా ఏళ్ల క్రితం పెట్టా.

డౌన్ టు ఎర్త్ ఉండి.షణ్ముఖ్ గేమ్ బాగా ఆడుతున్నాడని అంటున్నారు.

నేను అప్పుడప్పుడు అతని గేమ్ చూస్తున్నా.నా ఉద్దేశంలో షణ్ముఖ్‌కి ఓటు వేస్తే మంచి చేసినట్టే అవుతుంది.

శ్రీరామ చంద్ర క్యారెక్టర్‌ గురించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు కానీ మా ఇద్దరి చాటింగ్ మాత్రం నిజం అని తెలిపింది శ్రీరెడ్డి.

#Shanmukh #Sri Reddy #Sri Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube