పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి.. టీవీ షోలకు గుడ్ బై!  

actress sreemukhi reveals about her wedding plans, Anchor Sreemukhi, marriage, Cash Program, Anchor Suma - Telugu Actress Sreemukhi Reveals About Her Wedding Plans, Anchor Sreemukhi, Anchor Suma, Cash Program, Marriage

బుల్లితెర షోలలో హాట్ గా కనిపించి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు.పటాస్ షో ద్వారా శ్రీముఖికి మంచి గుర్తింపు వచ్చింది.

TeluguStop.com - Actress Sreemukhi Reveals About Her Wedding Plans

జులాయి, నేను శైలజ సినిమాల్లోని పాత్రల ద్వారా మంచి పేరు సంపాదించిన శ్రీముఖి వెండితెర కంటే బుల్లితెరకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో విన్నర్ గా నిలుస్తుందని భావించినా రన్నర్ గా నిలిచిన శ్రీముఖి పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గతంలో అనేక సందర్భాల్లో ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెస్తే సమాధానం దాటవేస్తూ వచ్చిన శ్రీముఖి 2022 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కబోతుందని సమాచారం.యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కు హాజరైన శ్రీముఖి ఆ ప్రోగ్రామ్ లో పెళ్లి గురించి మనస్సులోని మాటను బయటపెట్టింది.27 ఏళ్ల శ్రీముఖి 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటానని.పెళ్లి తరువాత యాంకరింగ్ కు, టీవీ షోలకు శ్రీముఖి గుడ్ బై చెప్పబోతున్నానని తెలిపింది.

TeluguStop.com - పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి.. టీవీ షోలకు గుడ్ బై-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రెండు సంవత్సరాల తర్వాత సుమను దాటేసి నంబర్ 1 యాంకర్ అవ్వాలనుకుంటున్నారా.? అని శ్రీముఖిని సుమ ప్రశ్నించగా తాను రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటానని.ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతానని.సుమనే నంబర్ 1 యాంకర్ గా ఉండాలని సమాధానమిచ్చారు.సరదాగా డ్యాన్సర్ పండుకు ఇష్టమైతే తననే పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

సెప్టెంబర్ 26వ తేదీన క్యాష్ ప్రోగ్రాం ప్రసారం కానుంది.ఈ ప్రోగ్రాంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.2022లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉండటంతో ఆలోపు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని శ్రీముఖి భావిస్తోందని తెలుస్తోంది.పెళ్లి తర్వాత పూర్తి సమయాన్ని భర్తకు, కుటుంబానికి కేటాయించడానికి శ్రీముఖి సిద్ధమవుతోంది.ప్రస్తుతం శ్రీముఖి ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అనే సినిమాలో నటిస్తోందని సమాచారం.

#Marriage #Anchor Suma #Cash Program

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Sreemukhi Reveals About Her Wedding Plans Related Telugu News,Photos/Pics,Images..